Janhvi Kapoor : ‘జాన్వీ కపూర్’ ని అంత మాట అనేశాడేంటి.. మానస్ పై జాన్వీ ఫ్యాన్స్ ఫైర్..

తాజాగా సీరియల్ నటుడు మానస్ ఓ విషయంలో జాన్వీ పేరు చెప్పడంతో వైరల్ గా మారింది.

Serial Actor Maanas Nagulapalli Comment on Janhvi Kapoor

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. యాక్టింగ్ లో కూడా మెప్పించిన జాన్వీ తన అందాలతో మాత్రం రెగ్యులర్ గా వైరల్ అవుతుంది. జాన్వీకి బాలీవుడ్ లోనే కాక ఇక్కడ సౌత్ లో కూడా ఫ్యాన్స్ బానే ఉన్నారు. ప్రస్తుతం జాన్వీ తెలుగులో రామ్ చరణ్ పెద్ది సినిమా చేస్తుంది.

తాజాగా సీరియల్ నటుడు మానస్ ఓ విషయంలో జాన్వీ పేరు చెప్పడంతో వైరల్ గా మారింది. సీరియల్స్, బిగ్ బాస్, పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మానస్ ఇటీవల ఆహా కాకమ్మ కథలు షోకి వచ్చారు.

Also Read : Bhanu Sri : నన్నే కాదు మా ఫ్యామిలీని ట్రోల్ చేసారు.. చాలా సఫర్ అయ్యాను.. బూతులతో మెసేజ్ లు.. భానుశ్రీ ఎమోషనల్..

ఈ షోలో హోస్ట్ తేజస్వి మడివాడ యాక్టింగ్ తక్కువ ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అని ఎవర్ని చూస్తే అనిపిస్తుంది అని అడగ్గా మానస్.. జాన్వీ కపూర్ అని సమాధానం చెప్పాడు. దీంతో ఈ కామెంట్ కాస్త వైరల్ అవ్వగా జాన్వీ ఫ్యాన్స్ మానస్ పై ఫైర్ అవుతున్నారు. జాన్వీ కపూర్ గుంజేన్ సక్సేనా, మిలి, మిస్టర్ & మిసెస్ మాహి.. సినిమాలు చూడలేదా తను ఎంత బాగా యాక్టింగ్ చేస్తుందో అని మానస్ ని విమర్శిస్తున్నారు. మరి దీనిపై మానస్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.