Bhanu Sri : నన్నే కాదు మా ఫ్యామిలీని ట్రోల్ చేసారు.. చాలా సఫర్ అయ్యాను.. బూతులతో మెసేజ్ లు.. భానుశ్రీ ఎమోషనల్..
ఇంటర్వ్యూలో ఆ సాంగ్ పాడటం వల్ల తనపై వచ్చిన ట్రోల్స్ గురించి ఎంతలా బాధపడిందో తెలిపింది.

Bhanu Sri Reacts on Trolls for Singing Pawan Kalyan Song
Bhanu Sri : నటి భానుశ్రీ బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత పలు టీవీ షోలు, సినిమాలు చేస్తూ బిజీగానే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం భానుశ్రీ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే టీవీ షోలో పవన్ కళ్యాణ్ గెలుపు తలుపులే సాంగ్.. ని పాడింది. తను ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ చేసింది. షోలో ఉన్న వాళ్లంతా ఆమెని అభినందించారు. అయితే బయట ఫ్యాన్స్, ఆ సాంగ్ లవర్స్ మాత్రం పాటని చెడగొట్టారు అంటూ తీవ్ర విమర్శలు చేసారు. సోషల్ మీడియాలో భానుశ్రీ ని ఈ విషయంలో బాగా ట్రోల్ చేసారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి భానుశ్రీ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆ సాంగ్ పాడటం వల్ల తనపై వచ్చిన ట్రోల్స్ గురించి ఎంతలా బాధపడిందో తెలిపింది.
భానుశ్రీ మాట్లాడుతూ.. నేను ఆ రోజు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే పాట పాడాను. అంతకుముందు కూడా చాలా పాటలు పాడాను, అభినందనలు వచ్చాయి. అందుకే ఆ పాట పాడాను. నేను ప్రొఫెషనల్ సింగర్ కాదు కేవలం ప్రేక్షకుల కోసం పాడాను. సెట్ లో అందరూ అభినందించారు. కానీ బయట సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేసారు. ఆ ట్రోల్స్ వల్ల చాలా సఫర్ అయ్యాను. నాతో పాటు ఇంట్లో అమ్మ, నాన్నలను, ఫ్యామిలీని కూడా ట్రోల్ చేసారు. ట్రోలర్స్, మీమర్స్ కి ఒకటే చెప్తున్నా మా మీద డబ్బులు సంపాదించుకొండి కానీ మా ఇంట్లో వాళ్ళ మీదకు ఎందుకు. ఇది నాన్సెన్స్. చాలా మంది యాక్టర్స్ ఈ ట్రోల్స్ వల్ల సఫర్ అవుతున్నారు. నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. నా వాయిస్ గురించి బూతులతో తిడుతూ మాట్లాడారు. రెండు రోజులు ఏడ్చాను కూడా. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ మోటివేట్ చేశారు. ఇప్పుడైతే అసలు ట్రోల్స్ గురించి పట్టించుకోను కూడా అని తెలిపింది.