Jabardasth Varsha : మా బావ చనిపోయాడు.. మా అక్క డిప్రెషన్ లోకి.. వాళ్లకు రిక్వెస్ట్ అంటూ.. ఏడ్చేసిన జబర్దస్త్ వర్ష..

తన ఫ్యామిలీ గురించి ఓ విషయం ఎక్కడా చెప్పలేదు అంటూ ఓ విషయాన్ని చెప్తూ ఏడ్చేసింది వర్ష.

Jabardasth Varsha : మా బావ చనిపోయాడు.. మా అక్క డిప్రెషన్ లోకి.. వాళ్లకు రిక్వెస్ట్ అంటూ.. ఏడ్చేసిన జబర్దస్త్ వర్ష..

Image Credits ; Big TV Plus Youtube Channel

Updated On : June 16, 2025 / 9:15 AM IST

Jabardasth Varsha : టీవీ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న వర్ష జబర్దస్త్ తో బాగా ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగానే ఉంది. వర్ష హోస్ట్ గా ఓ ఛానల్ లో ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. తాజాగా ఓ ఎపిసోడ్ లో ఫ్యామిలీ టాపిక్ రావడంతో తన ఫ్యామిలీ గురించి ఓ విషయం ఎక్కడా చెప్పలేదు అంటూ ఓ విషయాన్ని చెప్తూ ఏడ్చేసింది వర్ష.

జబర్దస్త్ వర్ష మాట్లాడుతూ.. మా బావ బయటకి వెళ్ళినప్పుడు బైక్ గుద్దేసింది. అప్పుడే ఇంట్లోంచి బయటకు వెళ్లారు. హాస్పిటల్ కి రండి అని మా అక్కకి ఫోన్ వచ్చింది. వెళ్ళేసరికే మా బావ గారు చనిపోయారు. మా బావ చనిపోయినప్పట్నుంచి మా అక్క ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. మా బావ బట్టలు అన్ని తీసుకొని కప్పుకొని పడుకుంటుంది. శవాన్ని తీసుకొస్తుంటే పిన్ని మాకు అసలు టిఫిన్ తెచ్చుకోవడం కూడా తెలీదు, రేపట్నుంచి మేము ఎవర్ని అడగాలి పిన్ని అని మా అక్క పిల్లలు నన్ను పట్టుకొని ఏడ్చేశారు. డబ్బులు ఇంపార్టెంట్ కానీ మనుషులు అంతకంటే ఇంపార్టెంట్. ఇవాళ మా దగ్గర ఎన్ని ఉన్నా మా అక్కకు బావ లేని లోటు తీర్చలేకపోతున్నాం. బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయండి. మీ ఆనందం ఇంకొకరికి శాపం కాకూడదు. చూసుకొని డ్రైవ్ చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్ అంటూ ఇంటర్వ్యూలో ఏడ్చేసింది.

Also Read : Director Maruthi : అక్కడ మా నాన్న అరటిపండ్లు అమ్మేవాడు.. ఇవాళ నా సినిమా కటౌట్.. రాజాసాబ్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..

దీంతో ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే వర్ష కుటుంబంలో ఇంత విషాదం ఉందా అని ఫీల్ అవుతున్నారు. వర్ష వాళ్ళ బావ ఓ బైక్ రాష్ డ్రైవింగ్ వల్ల చనిపోయాడని తెలుస్తుంది. ఇటీవల చాలా మంది యూత్ బైక్స్ ని రాష్ గా డ్రైవ్ చేస్తున్నారు. అది మీకు ఆ సమయానికి థ్రిల్ ఇచ్చినా ఏదైనా జరగకూడనిది జరిగితే జీవితాంతం ఫ్యామిలీలు బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి.