Shaakuntalam first single release date fix
Shaakuntalam : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘శాకుంతలం’. హిందూ ఇతిహాసాలు ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్నాడు. సమంత మెయిన్ లీడ్ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంత మహారాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లోని విజువల్స్, గుణశేఖర్ టేకింగ్ చూసిన ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది.
Shaakuntalam : విజువల్ వండర్‌గా ‘శాకుంతలం’ ట్రైలర్.. గుణశేఖర్ మార్క్ మూవీ!
ఇక మూవీ టీం శాకుంతలం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ మూవీలోని మొదటి సాంగ్ ని రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. స్వర బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలోని ఫస్ట్ సింగల్ ‘మల్లికా’ అంటూ సాగే పాటని ఈ నెల 18న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ వెండితెర అరగేంట్రం చేస్తుంది. ప్రిన్స్ భారత పాత్రలో అల్లు అర్హ కనిపించబోతుంది.
మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఈ సినిమాని గుణశేఖర్ టీం వర్క్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. దిల్ రాజు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మైథలాజికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇక గ్రాఫిక్స్ విషయంలో రుద్రమ్మదేవి సినిమాకి విమర్శలు ఎదురుకున్న గుణశేఖర్.. ఈ సినిమాలో ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకున్నాడు. ట్రైలర్ లో కనిపించిన రిచ్ విజువల్స్, యుద్ధ సన్నివేశాలు చూస్తుంటే గుణశేఖర్ గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేటట్టు ఉన్నాడు.
Starting off the musical journey of #Shaakuntalam with the First Single ?#Mallika/#Malligaa/#Mallike on Jan 18th ?
Music by Melody Brahma #ManiSharma ?@Gunasekhar1 @ActorDevMohan @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/or8ntqc170
— Samantha (@Samanthaprabhu2) January 16, 2023