ఎన్టీఆర్ ఏం అందగాడండీ : షావుకారు జానకి

షావుకారు జానకి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి చెప్పిన మాటలు అభిమానులను అలరించాయి..

  • Publish Date - May 16, 2019 / 09:40 AM IST

షావుకారు జానకి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి చెప్పిన మాటలు అభిమానులను అలరించాయి..

షావుకారు జానకి.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథానాయికగా ఆమెది ఒక ప్రత్యేకమైన స్థానం.. ఎన్నో సినిమాల్లో పలు విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. చాలాకాలం తర్వాత ‘ఎవడే సుబ్రహ్మణ్మం’, ‘కంచె’, ‘బాబు బంగారం’ సినిమాలతో అలరించిన జానకి, ఇటీవల ఆలీ హోస్ట్ చేస్తున్న ఒక టీవీ షోకి హాజరయ్యారు. తన పర్సనల్ అండ్ ప్రఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన ఆసక్తి కరమైన విషయాలు చెప్పిన షావుకారు జానకి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి చెప్పిన మాటలు అభిమానులను అలరించాయి.

ఆమె ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ : ‘ఆయనదసలు ఏం అందమండీ బాబూ.. పెళ్ళైన తర్వాత సినిమా పరిశ్రకి వచ్చాం కాబట్టి, అలాంటి ఆలోచనలకు మాకెక్కడా తావులేదు.. వాళ్ళూ భయపడే వాళ్లు, నేనూ భయపడేదాన్ని.. చూసి, అలా అడ్మైర్ చేసి, ఏమిటీ అందం అనుకునే వాళ్ళం.. అంత అందమైన రూపం ఆయనిది’.. అంటూ ఎన్టీఆర్‌తో నటించిన రోజులను గుర్తు చేసుకున్నారు షావుకారు జానకి.