రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటికి తీవ్రగాయాలు
బాలీవుడ్ ప్రముఖ, సీనియర్ నటి షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం(జనవరి 18,2020)

బాలీవుడ్ ప్రముఖ, సీనియర్ నటి షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం(జనవరి 18,2020)
బాలీవుడ్ ప్రముఖ, సీనియర్ నటి షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం(జనవరి 18,2020) మధ్యాహ్నం ముంబై-పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. కొల్హాపూర్ టోల్ ప్లాజా సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టింది. స్థానికులు వెంటనే ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త జావేద్ అక్తర్ కూడా కారులోనే ప్రయాణిస్తున్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.
కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా.. కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. గత రాత్రే షబానా.. తన భర్త 75వ జన్మదినాన్ని ముంబైలో జరిపారు. వేడుకల్లో ఆనందంగా గడిపారు. ఇంతలోనే ఊహించని ఘోరం జరిగింది.
షబానా అజ్మీ ప్రమాద ఘటనపై బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు షాక్ కి గురయ్యారు. పలువురు.. జావేద్ అక్తర్ కు ఫోన్ చేశారు. షబానా అజ్మీ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆమె కోలుకోవాలని ఆకాంక్షించారు.
షబానా అజ్మీ ప్రమాద ఘటన వివరాలను.. హైవే పోలీస్ పెట్రోల్ టీమ్ మీడియాకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రమాద ఘటనపై వివరాలు సేకరించడానికి దర్యాప్తు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపామని పోలీసులు తెలిపారు.
Also Read :ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్…చైనాలో పెరుగుతున్న మృతుల సంఖ్య
Raigad Police: Actor Shabana Azmi&her driver got injured in accident near Kahalpur on Mumbai-Pune Expressway. Javed Akhtar was also present in the car, but he is safe. Their vehicle was hit by a truck while they were travelling from Pune to Mumbai. Injured shifted to MGM Hospital https://t.co/bezuNWvUTa pic.twitter.com/8YWtZoEUSF
— ANI (@ANI) January 18, 2020