Shah Rukh Khan Dunki Movie 17 Days Collections its hard to get 500 Crores
Dunki Collections : రాజ్ కుమార్ హిరాణి(Rajkumar Hirani) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), తాప్సీ(Tapsee Pannu) జంటగా విక్కీ కౌశల్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘డంకీ’. డిసెంబర్ 21న విడుదల అయిన ఈ సినిమా కామెడీ ఎమోషనల్ కంటెంట్ తో పర్వాలేదనిపించింది. ఓ అయిదుగురు ఫ్రెండ్స్ కలిసి లండన్ వెళ్ళాలి అనుకోని వీసా రాకపోతే ఇల్లీగల్ గా ఎలా వెళ్లారు, అలా వెళ్తుండగా ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి అనే కథాంశంతో డంకీ తెరకెక్కింది.
అయితే ఈ సినిమా విమర్శకులని మెప్పించినా కమర్షియల్ గా అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. షారుఖ్ గత రెండు సినిమాలు పఠాన్, జవాన్ సినిమాలు 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయడంతో డంకీ మీద కూడా ఆ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. కానీ డంకీ నిరాశపరిచిందనే చెప్పాలి. డంకీ సినిమా మొదటి రోజు కేవలం 40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి అభిమానులని తీవ్ర నిరాశ పరిచింది.
Also Read : Chiranjeevi : సంక్రాంతి సినిమాల విడుదలపై మెగాస్టార్ కామెంట్స్.. దిల్ రాజుని నేను ప్రశ్నించా..
ఇక డంకీ సినిమాకి మన ప్రభాస్ సలార్ సినిమా పోటీ ఉండటంతో ఆ రకంగా కూడా కలెక్షన్స్ తగ్గాయని చెప్పొచ్చు. ఇప్పటివరకు డంకీ సినిమా రిలీజయిన 17 రోజులకు 436.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇంకా 500 కోట్లు కూడా దాటలేదు డంకీ సినిమా. 500 కోట్లు తెచ్చుకోవడానికి డంకీ యూనిట్ చాలా కష్టపడుతుంది. ఇంకో నాలుగు రోజుల్లో సంక్రాంతి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ లోపు మిగిలిన 70 కోట్లు కలెక్ట్ చేయకపోతే డంకీ సినిమా 500 కోట్లు కష్టమే. ఇక డంకీ సినిమాకి పోటీగా నిలిచిన సలార్ సినిమా మాత్రం ఇప్పటికే 650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. సంక్రాంతి సినిమాలు వచ్చేలోపు 700 కోట్లు వసూలు చేయాలని చూస్తుంది.
Dunki's Box Office streak continues with your love! ✨?
Book your tickets right away!https://t.co/DIjTgPqLDI
Watch #Dunki – In Cinemas Now! pic.twitter.com/VkjO8yhN63
— Red Chillies Entertainment (@RedChilliesEnt) January 7, 2024