Dunki Collections : డంకీ డే1 కలెక్షన్స్ మరీ ఇంత తక్కువా? షారుఖ్‌కి హ్యాట్రిక్ కష్టమేనా?

డంకీ సినిమా ఎమోషనల్ డ్రామా కావడంతో మొదటి రోజు మిక్స్‌డ్ టాక్స్ వచ్చాయి. డంకీ కేవలం హిందీలోనే రిలీజ్ కావడంతో సౌత్ లో పెద్దగా ఎవ్వరూ ఆసక్తి చూపించలేదు.

Shah Rukh Khan Dunki Movie Day 1 Collections

Dunki Day 1 Collections : రాజ్ కుమార్ హిరాణి(Rajkumar Hirani) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) హీరోగా తెరకెక్కిన డంకీ సినిమా నిన్న డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజయింది. ఈ సినిమా కేవలం హిందీ భాషలోనే రిలీజయింది. అయితే షారుఖ్ గత రెండు సినిమాలు పఠాన్, జవాన్ భారీ హిట్స్ అయి ఏకంగా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

కానీ డంకీ సినిమా ఎమోషనల్ డ్రామా కావడంతో మొదటి రోజు మిక్స్‌డ్ టాక్స్ వచ్చాయి. డంకీ కేవలం హిందీలోనే రిలీజ్ కావడంతో సౌత్ లో పెద్దగా ఎవ్వరూ ఆసక్తి చూపించలేదు. సినిమా కాన్సెప్ట్ బాగున్నా కేవలం A సెంటర్స్ కి మాత్రమే పరిమితయ్యేలా ఉంది డంకీ.

Also Read : Salaar Part 1 Review : సలార్ మూవీ రివ్యూ.. సినిమాలో ఎలివేషన్స్ కాదు.. ఎలివేషన్స్‌తోనే సినిమా..

షారుఖ్ గత రెండు సినిమాలు మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాగా డంకీ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 70 కోట్ల వరకు మాత్రమే గ్రాస్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇక ఇండియాలో అయితే కేవలం 60 కోట్ల గ్రాస్ అంటే దాదాపు 30 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా పలువురు సినీ ట్రేడ్ ప్రముఖులు తమ సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. అయితే గత రెండు సినిమాలు భారీగా కలెక్షన్స్ వచ్చి ఈ సినిమాకి దారుణంగా పడటంతో పాటు మిక్స్‌డ్ టాక్ కూడా రావడం, సలార్ పోటీకి ఉండటంతో.. షారుఖ్ హ్యాట్రిక్ సాధిస్తాడా? ఈసారి కూడా 1000 కోట్లు సాధిస్తాడా అని అభిమానులు డౌట్ పడుతున్నారు.