Dunki Collections : షారుఖ్ ‘డంకీ’ కష్టాలు.. 500 కోట్లు కలెక్ట్ కాకుండానే థియేటర్స్ నుంచి అవుట్..?

డంకీ టైంకి సలార్ రిలీజ్ అవ్వడం కూడా షారుఖ్ డంకీకి సౌత్ లో దెబ్బ పడింది. అంతే కాకుండా డంకీని కేవలం హిందీలోనే రిలీజ్ చేశారు.

Shah Rukh Khan Dunki Movie Full Run Collections Full Details Here

Dunki Collections : బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) గత సంవత్సరం పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల మాస్ హిట్స్ కొట్టడంతో సంవత్సరం చివర్లో డిసెంబర్ లో వచ్చిన డంకీ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా కూడా 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని భావించారు. కానీ ఈ సినిమా కామెడీ, ఎమోషనల్, సోషల్ కంటెంట్ తో ఉండటంతో అందరికి కనెక్ట్ కాలేకపోయింది. మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి.

షారుఖ్ సినిమా అని ఓపెనింగ్స్ తప్ప ఆ కలెక్షన్స్ ని నిలబెట్టుకోలేకపోయింది డంకీ. అదే టైంకి సలార్ రిలీజ్ అవ్వడం కూడా షారుఖ్ డంకీకి సౌత్ లో దెబ్బ పడింది. అంతే కాకుండా డంకీని కేవలం హిందీలోనే రిలీజ్ చేశారు. అప్పటికి డంకీ సినిమాకి కలెక్షన్స్ తెప్పించడానికి మూవీ యూనిట్ నార్త్ లో సలార్ కి థియేటర్స్ ఇవ్వకుండా చాలానే ప్రయత్నాలు చేసింది. మొదటి రోజు కేవలం 45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన డంకీ నెల రోజుల్లో 470 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.

Also Read : Raamam Raaghavam : దర్శకుడిగా కమెడియన్ ధనరాజ్ ఫస్ట్ మూవీ.. ‘రామం రాఘవం’ ఫస్ట్ లుక్ రిలీజ్..

కనీసం 500 కోట్ల గ్రాస్ అయినా కలెక్ట్ చేస్తుందని అభిమానులు ఆశపడ్డారు. ఇప్పటికే సౌత్ లో డంకీ అసలు ఎక్కడా ఆడట్లేదు. నార్త్ లో కూడా కేవలం కొన్ని థియేటర్స్ లోనే ఆడుతుంది. హనుమాన్ నార్త్ లో దూసుకుపోతుండటంతో డంకీని ఎవరూ పట్టించుకోవట్లేదు. జనవరి 26 ఫైటర్ సినిమా రిలీజ్ అయితే డంకీకి థియేటర్స్ ఉండవు. కలెక్షన్స్ రావాలని సినిమా రిలీజయి నెల రోజులు దాటుతున్నా ఓటీటీకి ఇవ్వకుండా ఆపుతున్నారు. ఇప్పటికే డంకీ సినిమా థియేటర్స్ నుంచి బయటకి వచ్చేసినట్టే. మరి మిగిలిన 30 కోట్లు కూడా కలెక్ట్ చేసి 500 కోట్ల గ్రాస్ రౌండ్ ఫిగర్ చేస్తుందా? లేదా ముందే థియేటర్స్ నుంచి బయటకు వచ్చేస్తుందా చూడాలి.