Raamam Raaghavam : దర్శకుడిగా కమెడియన్ ధనరాజ్ ఫస్ట్ మూవీ.. ‘రామం రాఘవం’ ఫస్ట్ లుక్ రిలీజ్..

దర్శకుడిగా పరిచయం అవుతున్న కమెడియన్ ధనరాజ్ ఫస్ట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.

Raamam Raaghavam : దర్శకుడిగా కమెడియన్ ధనరాజ్ ఫస్ట్ మూవీ.. ‘రామం రాఘవం’ ఫస్ట్ లుక్ రిలీజ్..

jabardasth comedian Dhanraj Samuthirakani new movie Raamam Raaghavam first look

Updated On : January 23, 2024 / 9:27 PM IST

Raamam Raaghavam : ఇటీవల జబర్దస్త్ కమెడియన్ వేణు.. దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ‘బలగం’.. ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మరో కమెడియన్ దర్శకుడిగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. జబర్దస్త్ షోలో తన ధనాధన్ కామెడీతో బుల్లితెర ఆడియన్స్ ని అలరించిన ధనరాజ్.. వెండితెర పై పలు సినిమాల్లో కమెడియన్‌గా, మెయిన్ లీడ్‌లో కూడా నటించారు.

ఇక ఇప్పుడు దర్శకుడిగా మారుతూ.. తన మొదటి సినిమానే బై లింగువల్ గా తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ లో ఈ మూవీని అనౌన్స్ చేసిన ధనరాజ్.. తాజాగా సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ మూవీకి ‘రామం రాఘవం’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. ఇక ఈ చిత్రంలో సముద్రఖని, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Also read : 2024 Oscars Nominations : 96వ ఆస్కార్ నామినేషన్స్ ఫుల్ లిస్ట్ వచ్చేసింది.. మలయాళ మూవీ ‘2018’ సెలెక్ట్ అయ్యిందా..!

jabardasth comedian Dhanraj Samuthirakani new movie Raamam Raaghavam first look

ఈ సినిమాలో సముద్రఖని, ధనరాజ్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారట. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ని సరికొత్తగా అద్భుతంగా తీసుకురాబోతున్నట్లు ధనరాజ్ తెలియజేశారు. ఈ చిత్రానికి ‘విమానం’ సినిమా దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందించారు. విమానం చిత్రంలో సముద్రఖని, ధనరాజ్ కలిసి ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరుణ్ చిలువేరు ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, రాకెట్ రాఘవ, రచ్చ రవి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించనున్నారు.