Shah Rukh Khan : మిషన్‌ ఇంపాజిబుల్‌, జాన్ విక్ చిత్రాలతో.. ఇంటర్నేషనల్ అవార్డుల్లో షారుఖ్ సినిమాలు పోటీ..

ఇంటర్నేషనల్ యాక్షన్ ఫిలిం స్టంట్ అవార్డుల్లో మిషన్‌ ఇంపాజిబుల్‌, జాన్ విక్ చిత్రాలతో షారుఖ్ సినిమాలు పఠాన్, జవాన్ పోటీ పడుతున్నాయి.

Shah Rukh Khan Jawan Pathaan movies got nominations in Vulture stunt awards

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా గత ఏడాది పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన పఠాన్, జవాన్ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసి ఇండియన్ బ్లాక్ బస్టర్స్ ఆఫ్ 2023గా నిలిచాయి. ఇక ఈ రెండు చిత్రాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా సత్తా చాటుతున్నాయి. న్యూయార్క్‌లో నిర్వహించే మ్యాగజైన్ ‘వల్చర్‌ 2023 యాన్యువల్‌ స్టంట్‌’ అవార్డుల నామినేషన్స్‌ లో ఈ రెండు సినిమాలు స్థానం దక్కించుకున్నాయి.

జవాన్ సినిమా మొత్తం మూడు నామినేషన్స్ లో ఎలెక్ట్ అయితే, పఠాన్ రెండు క్యాటగిరీల్లో నామినేట్ అయ్యింది. కాగా ఈ నామినేషన్స్ లో హాలీవుడ్ టాప్ యాక్షన్ మూవీస్ జాన్ విక్, మిషన్‌ ఇంపాజిబుల్‌, ఫాస్ట్ ఎక్స్ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. వాటితో షారుఖ్ సినిమాలు పోటీ పడుతుండడంతో.. ఈ అవార్డుల పై ఆసక్తి మొదలయింది. ఇంతకీ ఈ రెండు చిత్రాలు ఏఏ క్యాటగిరీల్లో సెలెక్ట్ అయ్యాయో చూసేయండి.

Also read : Rashmika Mandanna : యానిమల్ పార్క్‌లో నా పాత్ర కూడా వైల్డ్‌గా ఉంటుంది.. స్టోరీలోని సీన్స్..

బెస్ట్ స్టంట్ యాక్షన్ ఫిలిం క్యాటగిరీలో ‘జవాన్’ సినిమా ‘హైవే ఛేజ్’ సీన్‌తో.. The Equalizer 3, Extraction 2, John Wick Chapter 4, Mission Impossible Dead Reckoning Part One చిత్రాలతో పోటీ పడుతుంది. అలాగే బెస్ట్ వెహికలర్ స్టంట్ కూడా జవాన్ ‘హైవే ఛేజ్’ సీన్‌తో పోటీ పడుతుంది. ఈ నామినేషన్స్ లో ఉన్న హాలీవుడ్ సినిమాలు ఏంటంటే.. Fast X, Ferrari, John Wick, Mission Impossible.

ఇక బెస్ట్ ఏరియల్ స్టంట్ క్యాటగిరీలో పఠాన్ సినిమా ‘జెట్ ప్యాక్ ఫైట్’తో.. Extraction 2, Godzilla Minus One, Kandahar, Mission Impossible సినిమాలతో పోటీ పడుతుంది. చివరిగా ఓవర్ ఆల్ యాక్షన్ ఫిలిం క్యాటగిరీలో జవాన్, పఠాన్ సినిమాలు.. Extraction 2, John Wick, Mission Impossible సినిమాలతో పాటు మరో ఐదు హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్నాయి. మరి వీటిలో జవాన్, పఠాన్ ఎన్ని అవార్డులను సొంతం చేసుకుంటాయో చూడాలి.