Rashmika Mandanna : యానిమల్ పార్క్‌లో నా పాత్ర కూడా వైల్డ్‌గా ఉంటుంది.. స్టోరీలోని సీన్స్..
యానిమల్ పార్క్‌లో రష్మిక పాత్ర కూడా వైల్డ్‌గా ఉంటుందట. సినిమాలోని కొన్ని సీన్స్ ని సందీప్ వంగ..

Rashmika Mandanna interesting comments about her role in Animal Park movie
Rashmika Mandanna : సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ హీరోగా నటించారు. మూవీలో రణబీర్ పాత్ర చాలా వైల్డ్ అండ్ బోల్డ్ గా ఉంటుంది. ఆల్ఫా మేల్ పాత్రలో రణబీర్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 900 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసింది.
ఇక ఈ మూవీ చివరిలో సీక్వెల్ ని ప్రకటిస్తూ ‘యానిమల్ పార్క్’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణబీర్ రోల్ మరింత వైల్డ్ ఉండబోతుందని, మూవీ కూడా మొదటి పార్ట్ ని మించిన కంటెంట్ తో ఉంటుందని సందీప్ రెడ్డి పలు ఇంటర్వ్యూల్లో తెలియజేశారు. దీంతో యానిమల్ పార్క్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఆ మూవీలో రష్మిక పాత్ర ఉంటుందా లేదా అని ఓ సందేహం కూడా నెలకుంది.
తాజాగా దీని పై రష్మిక క్లారిటీ ఇచ్చేశారు. సీక్వెల్ లో కూడా ఆమె పాత్ర ఉంటుందట. ఇక ఈ మూవీ గురించి ఆమె మాట్లాడుతూ.. “యానిమల్ పార్క్ గురించి సందీప్ నాకు కొన్ని సీన్స్ చెప్పాడు. ఆ మూవీ చాలా భయంకరంగా, వైల్డ్‌గా ఉంటుంది. అలాగే ఈ సీక్వెల్ లో నా పాత్ర కూడా చాలా వైల్డ్‌గా ఉంటుంది” అంటూ రష్మిక పేర్కొన్నారు. ఇక ఈ కామెంట్స్ తో మూవీ పై మరింత హైప్ క్రియేట్ అవుతుంది.
ఆల్ఫా మేల్ క్యారెక్టర్ తోనే మైండ్ బ్లాక్ చేసిన సందీప్ వంగ.. ఇప్పుడు ఆల్ఫా ఫిమేల్ పాత్రతో కూడా థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారని ఆడియన్స్ సినిమా అంచనాలను పెంచుకుంటున్నారు. కాగా సందీప్ వంగ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రభాస్ తో చేయాల్సి ఉంది. ప్రభాస్ తో ‘స్పిరిట్’ తెరకెక్కించిన తరువాత యానిమల్ పార్క్ ని పట్టాలు ఎక్కించనున్నారు. స్పిరిట్ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో స్టార్ట్ కానుంది.