Director Vasishta : కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నాకే చిరంజీవి సినిమా చేస్తున్నాను.. బింబిసార 2 నేను డైరెక్ట్ చెయ్యట్లేదు..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ట ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

Director Vasishta takes permission from Kalyan Ram for Chiranjeevi Vishwambhara Movie
Director Vasishta : కళ్యాణ్ రామ్(Kalyan Ram) బింబిసార(Bimbisara) సినిమాతో ఫ్లాప్స్ నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ కథాంశంతో బింబిసార సినిమాని డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించాడు. వశిష్టకు దర్శకుడిగా అదే మొదటి సినిమా కావడం గమనార్హం. బింబిసార భారీ విజయం సాధించింది. దీంతో ఆ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు. కానీ బింబిసార సీక్వెల్ ని వశిష్ట డైరెక్ట్ చెయ్యట్లేదు.
ప్రస్తుతం వశిష్ట చిరంజీవి(Chiranjeevi) విశ్వంభర(Vishwambhara) సినిమాతో బిజీగా ఉన్నాడు. మెగా 156 సినిమాగా విశ్వంభర తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్ట్ టైటిల్ కూడా రిలీజ్ చేయగా బాగా వైరల్ అయింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీన్ని కూడా సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు వశిష్ట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ట ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
Also Read : Guntur Kaaram Collections : రమణగాడి జాతర.. వారం రోజుల్లో ‘గుంటూరు కారం’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
వశిష్ట మాట్లాడుతూ.. బింబిసార 2 సినిమా నేను చెయ్యట్లేదు. ఆ సినిమా చర్చల్లో ఉన్నప్పుడే నాకు చిరంజీవి గారితో ఛాన్స్ వచ్చింది. విశ్వంభర సినిమా ఓకే అయింది. నేను కళ్యాణ్ రామ్ గారికి చెప్తే ఆయన ఓకే అన్నారు. ఆయన అనుమతి తీసుకొనే బింబిసార 2 నుంచి బయటకి వచ్చి విశ్వంభర చిరంజీవి గారితో చేస్తున్నాను అని తెలిపాడు. బింబిసారతో అదరగొట్టిన వశిష్ట రేపు చిరంజీవిని విశ్వంభరలో ఏ రేంజ్ లో చూపిస్తారో చూడాలి.