Guntur Kaaram Collections : రమణగాడి జాతర.. వారం రోజుల్లో ‘గుంటూరు కారం’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

కలెక్షన్స్ లో కూడా గుంటూరు కారం సినిమా అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

Guntur Kaaram Collections : రమణగాడి జాతర.. వారం రోజుల్లో ‘గుంటూరు కారం’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Mahesh Babu Guntur Kaaram First Week Collections full Details

Updated On : January 19, 2024 / 9:25 AM IST

Guntur Kaaram Collections : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా ఈ సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిత్రయూనిట్ ఆల్రెడీ మహేష్ ఇంట్లో గుంటూరు కారం సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు. కామెడీ, లవ్, అమ్మ సెంటిమెంట్, మహేష్ మాస్ మేనియాతో గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులని మెప్పిస్తుంది.

ఇక కలెక్షన్స్ లో కూడా గుంటూరు కారం సినిమా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజే 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రీజనల్ సినిమాతో ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా గుంటూరు కారం సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఇక వారం రోజుల్లో గుంటూరు కారం సినిమా 212 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తాజాగా చిత్రయూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Also Read : Salaar : సలార్ ఓటీటీ రిలీజ్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్..

దీంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క భాషలోనే రిలీజయిన ఒక రీజనల్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయడం ఇదే మొదటి సారి. దీంతో మహేష్ సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. అంతేకాకుండా ఈ సినిమా 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ కూడా దక్కించుకుంది. దీంతో వరుసగా 5 రీజనల్ సినిమాలతో 100 కోట్లు షేర్ దక్కించిన ఏకైన హీరోగా కూడా మహేష్ రికార్డ్ సెట్ చేసాడు. రీజనల్ సినిమాలతోనే మహేష్ ఈ రేంజ్ లో రికార్డులు సెట్ చేస్తుంటే ఇక నెక్స్ట్ రాజమౌళి సినిమా నుంచి పాన్ ఇండియా రేంజ్ లో ఏ రేంజ్ లో రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.