Shah Rukh Khan only Indian in Empire magazine 50 Greatest Actors of All Time
Shah Rukh Khan : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో సపరేట్‌గా చెప్పనవసరం లేదు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా షారుఖ్ ని అభిమానిస్తుంటారు అభిమానులు. అయిదు పదుల వయసు వచ్చినా, తన స్టైల్‌తో యూత్ ని ఆకట్టుకుంటూ ఉంటాడు. తాజాగా ఈ బాలీవుడ్ బాద్‌షా ఒక అరుదైన గౌరవం దక్కించుకొని, ఆ ఘనత అందుకున్న ఏకైక భారతీయుడుగా నిలిచాడు.
Shah Rukh Khan : పఠాన్‌పై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన షారుఖ్..
ప్రముఖ బ్రిటిష్ మాగజైన్ ఎంపైర్ నిర్వహించే ’50 గ్రేటెస్ట్ యాక్టర్స్ అఫ్ అల్ టైం’ లిస్ట్ ని మంగళవారం రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో షారుఖ్ ఖాన్ స్థానం దక్కించుకున్నాడు. ఈ లిస్ట్ కి ఎంపికైంది భారతదేశం తరుపు నుంచి ఒక షారుఖ్ మాత్రమే. గత కొంతకాలంగా ఈ హీరో నటించిన సినిమాలు పెద్దగా అలరించకపోయిన ఈ ఘనత అందుకోవడంతో.. షారుఖ్ ఖాన్ ఈజ్ రియల్ బాద్‌షా’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ హీరో ‘పఠాన్’ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కాగా గత కొన్నిరోజులుగా ఈ సినిమా చుట్టూ వివాదం నెలకుంది. ఈ మూవీలోని ‘‘బేషరం రంగ్’ అనే సాంగ్ అసభ్యకర రీతిలో ఉందంటూ విమర్శలు ఎదురుకుంటుంది. ఈ వివాదం ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు చేరుకొంది.