Shah Rukh Khan : ఫ్యాన్స్ నన్ను ప్రశ్నించారు.. ఇకపై ఎక్కువ గ్యాప్ తీసుకోను..

షారుఖ్ ఖాన్ 2016 నుంచి వరుస సినిమాలు ఫ్లాప్స్ చూశాడు. తర్వాత 2018 నుంచి ఏకంగా ఐదేళ్లు గ్యాప్ తీసుకొని గత సంవత్సరమే థియేటర్స్ లో సందడి చేసాడు. షారుఖ్ తన కెరీర్ లో ఇంత లాంగ్ గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదు.

Shah Rukh Khan reacts on his Gap in Career before Pathaan

Shah Rukh Khan : బాలీవుడ్(Bollywood) బాద్‌షా షారుఖ్ ఖాన్ కొన్నేళ్ల క్రితం వరుస ఫ్లాప్స్ చూసి సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అంతా షారుఖ్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ గత సంవత్సరం పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల హిట్ సినిమాలు ఇచ్చి డంకీ సినిమాతో ఓ ఎమోషనల్ సినిమాని కూడా ఇచ్చాడు. ఒక్క సంవత్సరంలోనే మూడు సినిమాలతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి తన పని అయిపోయింది అన్న వాళ్ళ అందరికి సినిమాలతోనే సమాధానం చెప్పాడు.

అయితే షారుఖ్ ఖాన్ 2016 నుంచి వరుస సినిమాలు ఫ్లాప్స్ చూశాడు. తర్వాత 2018 నుంచి ఏకంగా ఐదేళ్లు గ్యాప్ తీసుకొని గత సంవత్సరమే థియేటర్స్ లో సందడి చేసాడు. షారుఖ్ తన కెరీర్ లో ఇంత లాంగ్ గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదు. దీనిపై అభిమానులు కూడా నిరాశ చెందారు. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న షారుఖ్ దీనిపై స్పందించాడు.

Also Read : AR Rahaman : AIతో చనిపోయిన సింగర్స్ వాయిస్‌ని తీసుకొచ్చి.. సాంగ్ పాడించిన రెహమాన్.. ఏ సినిమా కోసమో తెలుసా?

షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. నేను ఆల్మోస్ట్ 33 ఏళ్లుగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాను. ఇటీవల చాలా రోజులు నేను సినిమాలకు గ్యాప్ ఇచ్చాను. నేను మళ్ళీ సినిమాలు చేస్తానో లేదో అని కూడా అభిమానులు భయపడ్డారు. నేను చేస్తున్న సినిమాలు వరుసగా ప్రేక్షకులని మెప్పించలేకపోవడంతో నేను సరిగ్గా కథలు ఎంచుకోవట్లేదేమో, సరైన సినిమాలు చేయట్లేదేమో అని సందేహం వచ్చింది. అందుకే కొంచెం గ్యాప్ తీసుకొని మంచి సినిమాలు చేద్దామనుకున్నాను. ఆ గ్యాప్ తర్వాత పఠాన్, జవాన్ లాంటి సినిమాలతో వచ్చాను. నా సినిమాలతోనే కాక, పర్సనల్ గా కూడా ప్రేక్షకులు, అభిమానులు నన్ను వారి హృదయానికి దగ్గరగా తీసుకున్నారు. చాలా మంది అభిమానులు నన్ను ప్రశ్నించారు. నాలుగేళ్లు గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? సినిమా సినిమాకి 2 నుంచి 4 నెలల గ్యాప్ చాలు అని చెప్పారు. ఇండియాలోనే కాక, ఇండియా బయట కూడా నాపై ప్రేమ చూపిస్తున్న అభిమానులందరికి ధన్యవాదాలు. ఇకపై ఇలా జరగదు. ఇకపై సినిమాలకు ఎక్కువ గ్యాప్ తీసుకోను అని తెలిపారు.