AR Rahaman : AIతో చనిపోయిన సింగర్స్ వాయిస్‌ని తీసుకొచ్చి.. సాంగ్ పాడించిన రెహమాన్.. ఏ సినిమా కోసమో తెలుసా?
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యూజ్ చేసి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఓ మంచి పని చేశారు. చనిపోయిన ఇద్దరి సింగర్స్ వాయిస్ లని AIతో బతికించారు.

AR Rahaman Creates Singers Voice who Passed away long back with Artificial intelligence
AR Rahaman : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) టెక్నాలజీ ప్రస్తుత ప్రపంచంలో చాలా మార్పులు చేస్తుంది. AIతో ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చు. కానీ కొంతమంది దీన్ని చెడుకి ఉపయోగించడంతో చాలామంది AIతో అనర్దాలు తప్పవని భావిస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యూజ్ చేసి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఓ మంచి పని చేశారు. చనిపోయిన ఇద్దరి సింగర్స్ వాయిస్ లని AIతో బతికించారు.
రజినీకాంత్(Rajinikanth) ముఖ్య పాత్రలో, విష్ణు విశాల్ హీరోగా ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లాల్ సలామ్ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో తిమిరి ఎళుదా.. అనే ఓ సాంగ్ ని గతంలో మరణించిన బంబా బక్యా(Bamba Bakiya), షాహుల్ హమీద్(Shahul Hameed) సింగర్ల వాయిస్ లతో పాడించారు. తమిళ్ లో ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్స్ బంబా బక్యా గత సంవత్సరమే మరణించారు. షాహుల్ హమీద్ 1997 లోనే మరణించారు.
Also Read : Samantha : హమ్మయ్య.. మళ్ళీ సినిమా వర్క్ మొదలుపెట్టిన సమంత.. 22 నెలల తర్వాత అంటూ పోస్ట్..
ఇప్పుడు టైం లెస్ వాయిస్ అనే సంస్థ సహకారంతో AI తో చనిపోయిన ఆ ఇద్దరి వాయిస్ లని మళ్ళీ క్రియేట్ చేసి లాల్ సలామ్ సినిమాలోని సాంగ్ రహమాన్ సంగీత దర్శకత్వంలో పాడించడంతో ఈ పాట వైరల్ గా మారింది. ఈ విషయాన్ని సోనీ మ్యూజిక్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఏఆర్ రహమాన్ దీనిపై స్పందిస్తూ.. ఆ గాయకుల ఇద్దరి కుటుంబాల నుంచి పర్మిషన్ తీసుకున్నాం, వారికి కొంత రెమ్యునరేషన్ కూడా ఇచ్చాము. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో ఇద్దరి సింగర్స్ వాయిస్ లని వాడుకున్నాం. ఇది ఒక సాంకేతిక విప్లవం అని సోషల్ మీడియాలో తెలిపారు.
We took permission from their families and sent deserving remuneration for using their voice algorithms ..technology is not a threat and a nuisance if we use it right…#respect #nostalgia ? https://t.co/X2TpRoGT3l
— A.R.Rahman (@arrahman) January 29, 2024