Samantha : హమ్మయ్య.. మళ్ళీ సినిమా వర్క్ మొదలుపెట్టిన సమంత.. 22 నెలల తర్వాత అంటూ పోస్ట్..
తాజాగా సిటాడెల్ సిరీస్ డబ్బింగ్ వర్క్స్ మొదలుపెట్టింది సమంత.

Samantha started Citadel Dubbing Works after long gap back to cinema works
Samantha : సమంత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హెల్త్ పై ఫోకస్ చేయాలని, అలాగే తన బిజినెస్ లపై కూడా ఫోకస్ చేయాలని కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది. సమంత చివరగా ఖుషి సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ప్రస్తుతం సామ్ గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటూ పలు దేశాలు తిరిగేస్తుంది. ఇటీవలే ఓ సినీ నిర్మాణ సంస్థ కూడా స్థాపించింది.
అయితే ప్రస్తుతం సమంత చేతిలో కొత్తగా ఒప్పుకున్నా సినిమాలేమి లేవు. గతంలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ అనే ఓ సిరీస్ చేసింది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్(Citadel) కి రీమేక్ గా ఇండియన్ వర్షన్ లో ఇది తెరకెక్కిందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిపోయింది. సిరీస్ షూటింగ్ అయిపోయినా సమంత హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ సిరీస్ అక్కడే ఆగిపోయింది.
Also Read : Bhamakalapam 2 Teaser : ప్రియమణి భామాకలాపం 2 టీజర్ చూశారా?
తాజాగా ఈ సిటాడెల్ సిరీస్ డబ్బింగ్ వర్క్స్ మొదలుపెట్టింది సమంత. సిటాడెల్ కి డబ్బింగ్ చెప్తున్న ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది సమంత. అలాగే రాజ్ & డీకే టీంతో ల్యాప్ టాప్ లో సిటాడెల్ ఎడిటింగ్ వర్షన్ చూస్తున్న పలు ఫోటోలని కూడా షేర్ చేసింది సమంత. ఈ ఫోటోలని షేర్ చేస్తూ 22 నెలల తర్వాత ఈ ప్రాజెక్టు రెడీ అయింది అని పోస్ట్ చేసింది. ఇక ఈ సిటాడెల్ సిరీస్ యాక్షన్, రొమాంటిక్ గా ఉండనున్నట్టు సమాచారం. ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ లో రానుంది. మళ్ళీ సమంత ఈ సిటాడెల్ సిరీస్ తోనే ప్రేక్షకులని పలకరించనుంది. దీంతో సమంత ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.