Shah Rukh Khan
Shah Rukh Khan : ఇటీవల ఖతార్ నుంచి విడుదలైన ఎనిమిది మంది భారత నేవీ అధికారుల కేసులో తన ప్రమేయం ఉందన్న వార్తలపై బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ స్పందించారు. ఈ వార్తలను ఖండిస్తూ షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ షారుఖ్ తరపున ఒక ప్రకటన విడుదల చేసారు.
గూఢచర్యం ఆరోపణలతో 8 మంది భారత నేవీ మాజీ అధికారులను ఖతార్ ప్రభుత్వం అక్టోబర్ 2022 లో నిర్బంధించింది. ఖతార్ కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. భారత ప్రభుత్వం జోక్యంతో ఫిబ్రవరి 12న వీరంతా విడుదల అయ్యారు. కాగా ఇటీవలే బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఖతార్ పర్యటనకు వెళ్లడంతో నేవీ అధికారుల విడుదల విషయంలో షారుఖ్ పాత్ర ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. దీనిపై షారుఖ్ ఖాన్ స్పందించారు. ఆయన తరపున మేనేజర్ పూజా దద్లానీ ఒక ప్రకటన విడుదల చేసారు.
Priyamani : భామాకలాపం 2 మూవీ ప్రమోషన్స్‌లో ప్రియమణి ఫొటోలు..
‘ఖతార్ నుండి భారత నౌకాదళ అధికారులను విడుదల చేయడం వెనుక షారుఖ్ ఖాన్ ఉన్నారంటూ వచ్చిన వార్తలు నిరాధారమైనవి.. సమర్థులైన భారత ప్రభుత్వ అధికారుల వల్లే ఇది సాధ్యమైంది.. నౌకా దళ అధికారులు సురక్షితంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.. వారికి శుభాకాంక్షలు ‘ అంటూ సోషల్ మీడియాలో ప్రకటన పోస్టు చేసారు. షారుఖ్ ఇటీవల ఖతార్ సందర్శించారు. ఏఎఫ్‌సీ (Asian Football confederation) ఫైనల్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దోహాలో ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో షారుఖ్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే షారుఖ్ పై వార్తలు వచ్చాయి.
From the office of Mr. Shah Rukh Khan pic.twitter.com/s7Kwwhmd6j
— Pooja Dadlani (@pooja_dadlani) February 13, 2024