R Narayana Murthy : మొన్న ఎన్టీఆర్ సినిమా.. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా.. రిజెక్ట్ చేసిన ఆర్ నారాయణమూర్తి..

తాజాగా ఆర్ నారాయణమూర్తి రామ్ చరణ్ సినిమాని రిజెక్ట్ చేశారు.

R Narayana Murthy : మొన్న ఎన్టీఆర్ సినిమా.. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా.. రిజెక్ట్ చేసిన ఆర్ నారాయణమూర్తి..

R Narayana Murthy Rejected offer in Ram Charan Buchi Babu Sana RC 16 Movie

R Narayana Murthy : పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మొదటి నుంచి విప్లవాత్మక సినిమాలు చేస్తూనే వస్తున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టి హీరోగా, దర్శకుడిగా ఎదిగారు. ఎన్నో సూపర్ హిట్ విప్లవ సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించి, కొన్ని సినిమాలు నిర్మించి పీపుల్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు కూడా అడపాదడపా సందేశాత్మక సినిమాలు చేస్తున్నారు.

నటుడిగా ఆర్ నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తన నటనతో ప్రేక్షకులని మెప్పించారు. చాలామంది సీనియర్ నటులు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నారు. కానీ ఆర్ నారాయణమూర్తికి ఎన్ని సినిమాల్లో ఛాన్సులు వచ్చినా చేయట్లేదు. స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలకు ఆర్ నారాయణమూర్తిని రిక్వెస్ట్ చేస్తున్నా రిజెక్టు చేస్తున్నారు.

గతంలో టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళి పాత్రకి మొదట పూరీజగన్నాధ్ ఆర్ నారాయణమూర్తినే అడిగారు. కానీ ఆయన నో చెప్పారు. గతంలో ఓ ప్రెస్ మీట్లో ఆర్ నారాయణమూర్తి దీని గురించి స్పందిస్తూ.. నేను కష్టపడి ఎదిగి పైకి వచ్చి హీరో, దర్శకుడిగా మారాను, మళ్ళీ వెనక్కి వెళ్లి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయలేను. అంతేకాకుండా కమర్షియల్ సినిమాల్లో నేను భాగం అవ్వాలనుకోవట్లేదు అని తెలిపారు.

Also Read : Sharwanand : సైలెంట్‌గా శర్వానంద్ కొత్త మూవీ స్టార్ట్.. ఆ సూపర్ హిట్ డైరెక్టర్‌తో..

తాజాగా ఆర్ నారాయణమూర్తి రామ్ చరణ్(Ram Charan) సినిమాని రిజెక్ట్ చేశారు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు ఈ సినిమా కోసం కొత్త నటీనటుల్ని అన్వేషిస్తూ ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన సినిమాలో ఓ పాత్ర కోసం బుచ్చిబాబు ఆర్ నారాయణమూర్తి వద్దకు వెళ్లి అడిగాడు. కానీ ఆయన నో చెప్పారు. బుచ్చిబాబు ఆ పాత్ర మీరే చేయాలంటూ రిక్వెస్ట్ చేసినా, భారీ పారితోషికం ఇప్పిస్తానని చెప్పినా ఆర్ నారాయణమూర్తి నో చెప్పినట్టు సమాచారం. గతంలో ఎన్టీఆర్ టెంపర్ సినిమా రిజెక్ట్ చేసి ఇప్పుడు రామ్ చరణ్ సినిమా చేస్తే బాగోదు, కమర్షియల్ సినిమాలు నా పాలసీ కాదు అంటూ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.