Sharwanand : సైలెంట్‌గా శర్వానంద్ కొత్త మూవీ స్టార్ట్.. ఆ సూపర్ హిట్ డైరెక్టర్‌తో..

ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా శర్వానంద్ కొత్త మూవీ స్టార్ట్ అయ్యిపోయింది. ఆ సూపర్ హిట్ డైరెక్టర్‌తో..

Sharwanand : సైలెంట్‌గా శర్వానంద్ కొత్త మూవీ స్టార్ట్.. ఆ సూపర్ హిట్ డైరెక్టర్‌తో..

Sharwanand starts his 36th movie with super hit director

Sharwanand : టాలీవుడ్ హీరో శర్వానంద్ రెండేళ్ల నుంచి ఆడియన్స్ ముందుకు రావడం లేదు. 2022లో ‘ఒకే ఒక జీవితం’ మూవీ వచ్చి సూపర్ హిట్టు అందుకున్న శర్వానంద్.. ప్రస్తుతం తన 35వ సినిమాని చేస్తున్నారు. కొంతకాలంగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మధ్య శర్వానంద్ పెళ్లి జరగడంతో కొంచెం బ్రేక్ వచ్చింది. తాజాగా ఈ హీరో మరో కొత్త సినిమాని సైలెంట్ గా స్టార్ట్ చేసేసారు. అది కూడా గత ఏడాది సూపర్ హిట్ కొట్టిన దర్శకుడితో.

గత ఏడాది శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వా తన 36వ సినిమాని చేయబోతున్నారట. ఇక ఈ సినిమాలో నేచురల్ యాక్ట్రెస్ మాళవిక నాయర్ హీరోయిన్ గా నాటింటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోంది. నేడు ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఎటువంటి హడావుడి లేకుండా లాంచ్ అయ్యిపోయింది. అలాగే షూటింగ్ ని కూడా మొదలు పెట్టేశారట.

Also read : Hari Hara Veera Mallu : శివరాత్రికి ‘హరిహర వీరమల్లు’ స్పెషల్ ప్రోమో.. రిలీజ్ డేట్‌ని కూడా..

మార్చి మొదటి వారం వరకు ఈ మూవీ మొదటి షెడ్యూల్ జరుగుతుందని చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో మాళవిక నాయర్ తో పాటు సంయుక్త మీనన్, సాక్షి వైద్య కూడా నటించబోతున్నారని సమాచారం. మరి దర్శకుడు అబ్బరాజు.. సామజవరగమన లాగా ఈ చిత్రాన్ని కూడా ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ ని అందుకుంటారేమో చూడాలి.

ఇక శర్వానంద్ నటిస్తున్న 35వ సినిమా విషయానికి వస్తే.. శ్రీరామ్ ఆదిత్య ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కృతిశెట్టికి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆ మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ చాలావరకు ఫారిన్ లోనే షూట్ చేసారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. మలయాళ సంగీతం దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.