Shah Rukh Khan : ఫ్యాన్స్ తో షారుఖ్ స్పెషల్ మీట్.. షారుఖ్ బర్త్ డే, ‘డంకీ’ టీజర్ సెలబ్రేషన్..

షారుఖ్ పుట్టినరోజు నేపథ్యంలో ఫ్యాన్స్ తో స్పెషల్ మీట్ నిర్వహించారు. ఆస్క్ షారుఖ్ పేరిట పలువురు అభిమానులతో షారుఖ్ ప్రత్యేకంగా మీట్ అయ్యారు.

Shah Rukh Khan Special Meet with His Fans on His Birthday

Shah Rukh Khan : ఇటీవల నవంబర్ 2న షారుఖ్ ఖాన్ బర్త్ డే అని తెలిసిందే. షారుఖ్ బర్త్ డేని అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు స్పెషల్ విషెష్ చెప్పారు. ఇక షారుఖ్ పలువురు బాలీవుడ్ ప్రముఖులకు స్పెషల్ ప్రైవేట్ పార్టీ ఇచ్చాడు. అలాగే అభిమానుల కోసం తన రాబోయే సినిమా ‘డంకీ'(Dunki) టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.

షారుఖ్ పుట్టినరోజు నేపథ్యంలో ఫ్యాన్స్ తో స్పెషల్ మీట్ నిర్వహించారు. ఆస్క్ షారుఖ్ పేరిట పలువురు అభిమానులతో షారుఖ్ ప్రత్యేకంగా మీట్ అయ్యారు. ఈ మీట్ లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు షారుఖ్. అలాగే అభిమానులకు ఫోటోలు కూడా ఇచ్చారు. ఇక ఇదే ఫ్యాన్ మీట్ లో డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి కూడా వచ్చి ‘డంకీ’ సినిమా ప్రమోషన్స్ చేశారు.

Also Read : Payal Ghosh : బాలీవుడ్ నటులు బాలకృష్ణ సర్‌ని చూసి నేర్చుకోవాలి.. హీరోయిన్ ట్వీట్ వైరల్..

ఈ స్పెషల్ షారుఖ్ ఫ్యాన్స్ మీట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అభిమానుల శుభాకాంక్షలకి షారుఖ్ థ్యాంక్స్ చెప్తూ ఓ స్పెషల్ బోర్డు ఏర్పాటు చేశారు ఈ మీట్ లో.