Dunki : దుబాయ్‌లో ‘డంకీ’ డ్రోన్ షో అదిరిపోయింది.. బుర్జ్ ఖలీఫా వద్ద షారుఖ్ సందడి..

వరల్డ్స్ హైయెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా వద్ద షారుఖ్ అండ్ టీం.. అభిమానులతో కలిసి లైట్ అండ్ డ్రోన్ షోని చూస్తూ ఎంజాయ్ చేశారు.

Shah Rukh Khan Taapsee Dunki movie promotions at dubai burj khalifa

Dunki : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజ్ రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘డంకీ’. ఈ చిత్రం రేపు డిసెంబర్ 21న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ తో మూవీ టీం సందడి చేస్తుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ దుబాయ్ లో ఈ ప్రమోషన్స్ ని నిర్వహిస్తుంది. అక్కడ వరల్డ్స్ హైయెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా వద్ద షారుఖ్ అండ్ టీం.. అభిమానులతో కలిసి లైట్ అండ్ డ్రోన్ షోని చూస్తూ ఎంజాయ్ చేశారు.

బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ పై డంకీ ట్రైలర్ ని ప్రదర్శించారు. అనంతరం అక్కడే డ్రోన్స్ తో మూవీ రిలీజ్ డేట్‌ని, మూవీ క్యాస్ట్‌ని తెలియజేస్తూ చేసిన షో అందర్నీ ఆకట్టుకుంది. ఆ డ్రోన్ షో సమయంలో షారుఖ్ అక్కడే ఉన్న కెనాల్ బోట్ లో తన ఐకానిక్ స్టెప్ ని ప్రదర్శిస్తూ అందర్నీ ఉత్తేజపరిచారు. అలాగే స్టేజి పై డంకీ సాంగ్ కి డాన్స్ వేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతలూగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read : Rithu Chowdary : నా వీడియోలు మార్ఫింగ్ చేశారు.. మెంటల్ టార్చర్ అనుభవించాను.. రీతూ చౌదరి సంచలన వీడియో..

ఇక డంకీ కథ విషయానికి వస్తే.. ఒక ఊళ్ళో ఉండే అయిదుగురు స్నేహితులు ఎలాగైనా లండన్ వెళ్ళాలి అనుకుంటారు. అధికారికంగా వెళ్లాలి అంటే ఇంగ్లీష్ రావాలని అర్ధమవుతుంది. ఎంత ట్రై చేసినా వీసా రిజెక్ట్ అవుతుంది. దీంతో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు హిందీ రావాలని మనం రూల్ పెట్టామా? మరి మనకు ఇంగ్లీష్ ఎందుకు అని ఎలాగైనా లండన్ వెళ్లాలనుకుంటారు. అక్రమంగా దేశాలు దాటుతూ లండన్ ఎలా వెళ్లారు? ఈ క్రమంలో వారు వివిధ దేశాల నుంచి ఎదుర్కున్న సమస్యలు ఏంటి అనేది కథగా ఉండబోతుంది.

ఈ సినిమాలో తాప్సీ, విక్కీ కౌశల్, బోమన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఇప్పటికే పఠాన్, జవాన్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మరి ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ హ్యాట్రిక్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.