Rithu Chowdary : నా వీడియోలు మార్ఫింగ్ చేశారు.. మెంటల్ టార్చర్ అనుభవించాను.. రీతూ చౌదరి సంచలన వీడియో..

తనకి సంబంధించిన అన్ని విషయాలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది రీతూ చౌదరి. తాజాగా మరో సంచలన వీడియో పోస్ట్ చేసింది.

Rithu Chowdary : నా వీడియోలు మార్ఫింగ్ చేశారు.. మెంటల్ టార్చర్ అనుభవించాను.. రీతూ చౌదరి సంచలన వీడియో..

Rithu Chowdary Posted Sensational Video on her Morphing Videos

Updated On : December 20, 2023 / 8:10 AM IST

Rithu Chowdary : పలు సీరియల్స్, జబర్డస్త్ షోలతో రీతూ చౌదరి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలు,యూట్యూబ్ వీడియోలతో బిజీగానే ఉంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో ఫాలోవర్స్ ని అలరిస్తుంది. తనకి సంబంధించిన అన్ని విషయాలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది రీతూ చౌదరి.

ఇటీవల కొన్ని రోజుల క్రితం.. నేను ఓ ఇల్లు కొనుక్కోగా దానికి ఓ ఇంటీరియర్ డిజైనర్ వర్క్ చేస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసాడు అని ఓ వీడియో చేసి పోస్ట్ చేసింది. అతనిపై పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిపింది. తాజాగా మరో సంచలన వీడియో పోస్ట్ చేసింది. తన మార్ఫింగ్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు అని తెలిపింది రీతూ చౌదరి.

రీతూ చౌదరి ఈ వీడియోలో మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం నా వీడియోలు మార్ఫింగ్ చేసి, నన్నే ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో నా మీద అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. వీటితో చాలా మెంటల్ టార్చర్ చూశాను. చాలా ఆలోచించి పోలీసులకు దీనిపై కంప్లైంట్ చేశాను. ఈ విషయంలో మా ఫ్యామిలీ, నా బాయ్ ఫ్రెండ్, విష్ణుప్రియ సపోర్ట్ గా నిలిచారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆ పని చేసిన వాడ్ని పట్టుకున్నారు. కానీ అతను నేను చేయలేదక్కా అంటూ నాటకాలు ఆడాడు. అతని తరుపున వచ్చినవాళ్లు కూడా పాపం చిన్నపిల్లాడు వదిలేయండి అని మాట్లాడారు. సోషల్ మీడియాలో నాపై అసభ్యంగా కామెంట్స్ చేసే మరికొంతమంది పై కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశాను అని చెప్పింది.

Also Read : Pallavi Prashanth : బిగ్‌బాస్‌లో అలా.. కప్పు గెలిచాక ఇలా.. రైతులకు హెల్ప్ చేయడానికి నేనేమన్నా సీఎంనా?

అలాగే.. ఈ వీడియో చేయాలా వద్దా అని చాలా ఆలోచించాను. కానీ ఇలా మార్ఫింగ్ చేసి శునకానందం పొందేవాళ్ళని వదలకూడదు. ఎవరైనా అమ్మాయిలు ఇలా బాధపడ్డా పోలీసులకు ధైర్యంగా కంప్లైంట్ చేయండి. అందరికి ఇలాంటి వాళ్ళ గురించి తెలియాలి అనే ఈ వీడియో చేస్తున్నాను అని తెలిపింది రీతూ చౌదరి. దీంతో రీతూ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.