Pallavi Prashanth : బిగ్‌బాస్‌లో అలా.. కప్పు గెలిచాక ఇలా.. రైతులకు హెల్ప్ చేయడానికి నేనేమన్నా సీఎంనా?
బిగ్‌బాస్ హౌస్ లో ఉండగా, హౌస్ లోకి వెళ్లేముందు నేను రైతులకు హెల్ప్ చేస్తా, బిగ్‌బాస్ విన్ అయితే వచ్చే డబ్బులు రైతులకు పంచుతా అన్నాడు ప్రశాంత్.

Pallavi Prashanth Sensational Comments on Farmers after Winning Bigg Boss Title Video goes Viral
Pallavi Prashanth : ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ 7వ(Bigg Boss) సీజన్ లో పల్లవి ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించారు. రైతు బిడ్డ అని సోషల్ మీడియాలో పలు వీడియోలతో పాపులర్ తెచ్చుకొని ఆ తర్వాత బిగ్‌బాస్ కి వెళ్లాలని తనని తాను బాగా ప్రమోట్ చేసుకొని బిగ్‌బాస్ దాకా వచ్చాడు. హౌస్ లో చాలా అమాయకుడిగా, వినయంగా, నేను సామాన్య రైతు అంటూ చాలా సింపతీ క్రియేట్ చేసుకున్నాడు.
అయితే బిగ్‌బాస్ హౌస్ లో ఉండగా, హౌస్ లోకి వెళ్లేముందు నేను రైతులకు హెల్ప్ చేస్తా, బిగ్‌బాస్ విన్ అయితే వచ్చే డబ్బులు రైతులకు పంచుతా అన్నాడు ప్రశాంత్. కప్పు గెలిచాక కూడా స్టేజి మీద తాను గెలుచుకున్న డబ్బంతా ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా పేద రైతులకు పంచేస్తాను, రైతులందరికీ హెల్ప్ చేస్తాను అని అన్నాడు. కానీ హౌస్ నుంచి బయటకి రాగానే అతని యాటిట్యూడ్ మారిపోయింది. హౌస్ బయట అతని ఫ్యాన్స్ తో కలిసి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా పోలీసుల మీదే గొడవకు దిగాడు ప్రశాంత్.
కప్పు గెలిచాక అతని ఊరు వెళ్లగా అక్కడ కూడా ఊరేగింపు చేసుకుంటూ వెళ్ళాడు. అయితే మీడియా అతన్ని ఇంటర్వ్యూ చేసి.. ఇక్కడ చుట్టూ పక్కల 15 గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకి ఏమన్నా చేశారా గతంలో? ఇప్పుడు చేస్తారా? అని అడగగా పల్లవి ప్రశాంత్ సమాధానమిస్తూ.. నేనేమన్నా సీఎంనా వాళ్ళను చూసుకోవడానికి. పోనీ నాకు సీఎం పదవి ఇస్తారా రైతులకు హెల్ప్ చేస్తాను. నేను గెలుచుకున్న డబ్బులు ఇస్తానేమో రైతులకు. ఆ ఊర్లన్నిటికి నేనేం చేస్తా, పోనీ నన్ను మీరు సీఎం చేయండి అంటూ ఎగతాళిగా, ఆకతాయితనంగా మాట్లాడాడు.
దీంతో పల్లవి ప్రశాంత్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. హౌస్ లో, అంతకు ముందు చాలా వినయంగా, రైతులంటే దేవుళ్ళు అన్నట్టు మాట్లాడి, ఇప్పుడు కప్పు కొట్టి బయటకి రాగానే ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, రోడ్డు మీద ఆకతాయిలాగా బిహేవ్ చేస్తున్నాడు అంటూ పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే ఇలాంటి వాడికా మంచోడు అనుకోని ఓటు వేసింది అని చీదరించుకుంటున్నారు. ఇక ఆ అగెలుచుకున్న డబ్బులు కూడా రైతులకు ఇస్తాడో డౌటే అంటున్నారు పలువురు. మరి పల్లవి ప్రశాంత్ మున్ముందు ఏం చేస్తాడో చూడాలి.
Also Read : Amardeep : పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌కి అమర్ దీప్ సవాల్.. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి..
ఇక మరోవైపు బిగ్ బాస్ అయోయిపోయిన తర్వాత స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. పలు ప్రైవేట్, గవర్నమెంట్ వాహనాలు ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్ కూడా పోలీసులు చెప్పినా అక్కడ్నుంచి వెళ్లిపోకుండా అక్కడ ఊరేగింపులు చేసి ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టడంతో ఈ ఘటనలో అతనిపై, పలువురు ప్రశాంత్ ఫ్యాన్స్ పై కేసులు నమోదు చేసి ఓ ఇద్దర్ని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు.