Amardeep : పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌కి అమర్ దీప్ సవాల్.. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి..

పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌ చేసిన దాడి గురించి అమర్ దీప్ వీడియో పోస్ట్. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటూ సవాల్..

Amardeep : పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌కి అమర్ దీప్ సవాల్.. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి..

Biggboss runner up Amardeep video post about pallavi prashanth fans attack

Updated On : December 19, 2023 / 9:05 PM IST

Amardeep : బిగ్‌బాస్ సీజన్ 7 పూర్తి అయ్యినా.. ఇంకా హౌస్ లోని గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సీజన్ లో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య హౌస్ లో ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరిని అభిమానించే అభిమానులు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేసుకునేవారు. అయితే ఆ వార్స్ సృష్టిమించి ప్రత్యేక్ష దాడికి దిగేలా చేసింది. ఫైనల్ ఎపిసోడ్ పూర్తి చేసుకొని బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన అమర్ దీప్ పై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగిన సంగతి తెలిసిందే.

అతని కారు అద్దాలు పగలకొట్టి, కారులో ఉన్న కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేశారు. తాజాగా ఈ విషయం అమర్ దీప్ రెస్పాండ్ అయ్యాడు. ఆ విషయం గురించి మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.

అమర్ దీప్ వ్యాఖ్యలు..
ప్రతి ఒక్కరు ఆ కారు దాడి గురించి అడుగుతున్నారు. దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు. ఆ దాడి వల్ల నేను చాలా బాధపడ్డాను. కారు అద్దాలు పగలకొట్టి బయటకి రా నీ అంతు చూస్తా అంటూ బెదిరించారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఇష్టమొచ్చినట్లు చెయ్యండి. నేను భయపడను. కానీ కారు అద్దాలు పగలు కొట్టడం వల్ల ఆ అద్దాలు మా అమ్మ పై పడ్డాయి. వారికీ ఏ గాయం కాలేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే చాలా బాధపడాల్సి వచ్చేది. మీ ఇంటిలో కూడా అమ్మ, చెల్లి, కుటుంబసభ్యులు ఉంటారు. అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి.

Also read: Bigg Boss Fans Ruckus : బిగ్‌బాస్ ఫ్యాన్స్ విధ్వంసం కేసు.. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇలాంటివి ఎప్పుడు ఎవరికి చేయకండి. మీకు కోపం ఉంటే తిట్టండి, లేకుంటే వీడియోలు చేయండి. ఎలాగో అవి చేస్తున్నారు. నేను పడతున్నాను. కానీ నేను అవేవి పట్టించుకోను. నేను బిగ్‌బాస్ నుంచి గెలుపుతూనే వచ్చాను. నా ఫేవరెట్ హీరో నాకు అవకాశం ఇచ్చారు. అదే నాకు పెద్ద గెలుపు. చివరిసారిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరోసారి ఇలా చేయకండి. ఒకవేళ మీకు ఇంకా కోపం తగ్గకపోతే ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అక్కడికి ఒంటరిగా వస్తాను.