Bigg Boss Fans Ruckus : బిగ్‌బాస్ ఫ్యాన్స్ విధ్వంసం కేసు.. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

వీడియో, సీసీటీవీ పుటేజీ ఆధారంగా మరికొంత మంది ఆకతాయిలను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

Bigg Boss Fans Ruckus : బిగ్‌బాస్ ఫ్యాన్స్ విధ్వంసం కేసు.. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

Bigg Boss Fans Ruckus Case (Photo : Google)

Updated On : December 19, 2023 / 10:10 PM IST

బిగ్ బాస్ ఫ్యాన్స్ వీరంగం కేసుని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. బిగ్ బిస్ -7 ఫైనల్ తర్వాత అనుమతి లేని ర్యాలీ, వాహనాల ధ్వంసం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకి సంబంధించి ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విజయోస్తు ర్యాలీ తీసిన ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బిగ్ బిస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను రెండోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ర్యాలీగా తీసుకొచ్చింది ఆ ఇద్దరు కారు డ్రైవర్లే. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ప్రశాంత్ చెప్పడంతో రోడ్డు మీద కార్లను ఆపారు. దాంతో ఆకతాయిలు రెచ్చిపోయారు. విధ్వంసం సృష్టించారు. కార్లు, ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు.

Also Read : అందుకే రైతుబిడ్డకి ప్రైజ్ ఇచ్చారు.. ఇదంతా నాటకం.. బిగ్‌బాస్ పై మరోసారి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..

ఈ విధ్వంసానికి సంబంధించి వీడియో, సీసీటీవీ పుటేజీ ఆధారంగా మరికొంత మంది ఆకతాయిలను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. విధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ A-1 గా ఉండగా అతడి తమ్ముడు మనోహర్ A-2గా, మరో స్నేహితుడు A-3 గా కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. కాగా, ఈ కేసులో బిగ్ బిస్ విన్నర్ ప్రశాంత్ కూడా ఉన్నాడు.

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచాడు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో అభిమానులు బీభత్సం సృష్టించారు. పలు వాహనాలు ధ్వంసం చేశారు. రోడ్డు మీద వెళ్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టారు. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిని భయాందోళనకు గురి చేశారు.

గ్రాండ్ ఫినాలే అయిపోయాక కంటెస్టెంట్ల కార్ల మీదా దాడులు చేశారు. అమర్ దీప్ తన ఫ్యామిలీతో కారులో బయటికి వస్తుంటే అభిమానులు చుట్టుముట్టారు. కారుపై దాడి చేసి అద్దం పగలగొట్టారు. తమను వదిలేయాలని అమర్ దీప్ తల్లి చేతులు జోడించి ప్రాధేయపడ్డారు. అలాగే అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ కూడా జరిగింది. రోడ్డుపైనే కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు.

Also Read : బిగ్‌బాస్ విన్నర్ అమర్ దీప్ అవ్వాల్సింది? కానీ పల్లవి ప్రశాంత్ ? ఫ్యాన్స్‌కి భయపడ్డారా? సీజన్ 2లో జరిగిందే రిపీట్ అయిందా?

ఆర్టీసీ బస్సులపై దాడులను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని గుర్తించారు. దీంతో పల్లవి ప్రశాంత్‌తో పాటు అతడి ఫ్యాన్స్ పై కేసులు పెట్టారు. దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వాటిని సుమోటోగా తీసుకుని కేసులు పెట్టారు పోలీసులు.