Bigg Boss 7 Winner : బిగ్‌బాస్ విన్నర్ అమర్ దీప్ అవ్వాల్సింది? కానీ పల్లవి ప్రశాంత్ ? ఫ్యాన్స్‌కి భయపడ్డారా? సీజన్ 2లో జరిగిందే రిపీట్ అయిందా?
గతంలో సీజన్ 2లో కౌశల్ చేసినట్టే చేసి చివరికి బిగ్‌బాస్ మేనేజ్మెంట్ కూడా భయపడేలా చేసి విన్నర్ అయ్యాడు ప్రశాంత్ అని పలువురు ఆరోపిస్తున్నారు.

Amar Deep was supposed to be the winner of Bigg Boss but how did Pallavi Prashanth Become Winner
Bigg Boss 7 Winner : బిగ్‌బాస్ సీజన్ 7 నిన్నటితో పూర్తయింది. 14 మందితో మొదలై ఆ తర్వాత మరో అయిదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీతో రాగా బిగ్‌బాస్ 15 వారాలు సాగి ఫైనల్ కి ఆరుగురిని మిగిల్చారు. అర్జున్, ప్రియాంక జైన్, యావర్, శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్ లు ఫైనల్ కి వెళ్లారు. ఇక ఫైనల్ లో ఆరో ప్లేస్ లో అంబటి అర్జున్ నిలవగా, ఐదో ప్లేస్ లో ప్రియాంక జైన్, నాలుగో ప్లేస్ లో యావర్, మూడో ప్లేస్ లో శివాజీ, రెండో ప్లేస్ లో అమర్ దీప్ నిలవగా విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించారు.
అయితే పల్లవి ప్రశాంత్ విన్నర్ అని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముందు నుంచి రైతు బిడ్డ అని పొలాల్లో వీడియోలు తీసుకుంటూ సింపతీతో ఫాలోవర్స్ తెచ్చుకున్న ప్రశాంత్ నన్ను బిగ్ బాస్ కి తీసుకెళ్లండి అని ఓ సంవత్సరం పాటు అడుక్కుంటూ వీడియోలు చేసి మొత్తానికి హౌస్ లో చోటు సంపాదించాడు. ఇక హౌస్ లోకి వచ్చిన దగ్గర్నుంచి నేను రైతు బిడ్డని అంటూ రైతుల కష్టాలు అంటూ ఏడుస్తూ సింపతీ క్రియేట్ చేసుకొని ఫ్యాన్స్ ని తెచ్చుకున్నాడు. బయట కూడా తన ఫ్యాన్స్ పేజీలు పెట్టి బాగా ప్రమోట్ చేయించుకున్నాడు. షోలో టాస్కుల్లో పెద్దగా ఆడకపోయినా సింపతీతో, శివాజీ సపోర్ట్ తో ఫైనల్ వరకు వచ్చాడు. షోలో చాలా సార్లు ప్రశాంత్ – అమర్ మధ్య వాదనలు జరిగినా అమర్ కి తగ్గ కౌంటర్లు ప్రశాంత్ వేయలేకపోయాడు. చాలా సార్లు అమర్ అడిగిన లాజిక్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక సైలెంట్ అయ్యాడు ప్రశాంత్.
హౌస్ లో ప్రశాంత్ ని ఎవరన్నా ఏమన్నా అంటే బయట ఉన్న తన మనుషులతో తనని తిట్టిన కంటెస్టెంట్స్ పై, వాళ్ళ ఫ్యామిలీలపై సోషల్ మీడియాలో అసభ్య పదాలతో కూడా దాడి చేయించాడు. సందీప్ ఫ్యామిలీ డైరెక్ట్ గా వచ్చి ప్రశాంత్ ఫ్యాన్స్ మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పారు. ఇలా లోపల ఏమో అమాయకుడిగా నటిస్తూ, బయట తన మనుషులతో సోషల్ మీడియాలో రచ్చ చేయించాడు ప్రశాంత్. అసలు ఎవరికీ తెలియని, ఓట్లే పడని ప్రశాంత్ ఫైనల్ కి వచ్చారంటేనే అందరూ ఆశ్చర్యపోగా ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ టైటిల్ కూడా గెలుచుకున్నాడు.
అందరికి తెలిసిన అమర్ దీప్, శివాజీలకు ఓట్లు పడకపోవడం ఏంటో, టాస్కుల్లో ఫుల్ ఫైర్ మీద ఆడి, అందరికి సమాధానాలు చెప్పిన అమర్ సెకండ్ ప్లేస్ వరకు వచ్చి పక్కన పెట్టేయడం ఏంటో అని అభిమానులు, నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షో ఫైనల్ ముందు వచ్చిన లీక్స్ ప్రకారం అమర్ దీప్ విన్నర్ అని పలు వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరకు ప్రశాంత్ ని ప్రకటించారు.
Also Read : Pallavi Prashanth : బిగ్‌బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్.. ప్రైజ్ మనీ ఎంత? ఇంకేమేమి గెలుచుకున్నాడు?
అయితే గతంలో సీజన్ 2లో కౌశల్ చేసినట్టే చేసి చివరికి బిగ్‌బాస్ మేనేజ్మెంట్ కూడా భయపడేలా చేసి విన్నర్ అయ్యాడు ప్రశాంత్ అని పలువురు ఆరోపిస్తున్నారు. సీజన్ 2 లో కౌశల్ అభిమానులు కూడా ఇలాగే సోషల్ మీడియాలో, బయట రచ్చ చేసి వేరే కంటెస్టెంట్స్ ని తిట్టి, బిగ్ బాస్ హౌస్ ముందు హంగామా చేసి విన్నర్ కౌశల్ కి ఇవ్వకపోతే ఊరుకునేది లేదు అని భయపెట్టారు. అప్పటి యాంకర్ నానిపై కూడా విమర్శలు చేశారు. దీంతో అప్పుడు గీతామాధురిని కాదని కౌశల్ కి విన్నర్ ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇక షో అయ్యాక కంటెస్టెంట్స్ అంతా బయటకి వస్తుంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వేరే కంటెస్టెంట్స్ కార్లపై రాళ్లతో దాడి చేసి, వారిపై కూడా దాడి చేసి నానా రచ్చ చేశారు. దీనిపై మిగిలిన కంటెస్టెంట్స్ బాధపడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
#BiggBoss7Telugu
Run Raja Runn…..!!#PallaviPrashanth fans? https://t.co/lXvCLOnF9q pic.twitter.com/9fjHpqKYHK— Jay (@Jay48630516) December 18, 2023