CPI Narayana : అందుకే రైతుబిడ్డకి ప్రైజ్ ఇచ్చారు.. ఇదంతా నాటకం.. బిగ్‌బాస్ పై మరోసారి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
గతంలో అనేకసార్లు నారాయణ బిగ్‌బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు, కోర్టులో కేసు కూడా వేశారు. తాజాగా బిగ్‌బాస్ ఘటనపై సీపీఐ నారాయణ మాట్లాడుతూ..

CPI Narayana Sensational Comments on Bigg Boss and Pallavi Prashanth
CPI Narayana : : బిగ్‌బాస్ సీజన్ 7(Bigg Boss 7) పూర్తవ్వగా దీంట్లో పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) విన్నర్ గా నిలిచాడు. అయితే ఆదివారం రాత్రి బిగ్‌బాస్ హౌస్ బయట పల్లవి ప్రశాంత్ అభిమానులు వచ్చి నానా హంగామా చేసి వేరే కంటెస్టెంట్స్, వారి కార్లపై దాడి చేశారు. దీంతో వేరే కంటెస్టెంట్స్ అభిమానులు, పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవలు జరిగాయి. ఈ ఘటనలో పలు వాహనాలు, గవర్నమెంట్ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి.
ఇప్పటికే దీనిపై నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు ఈ ఘటనపై. పోలీసులు పల్లవి ప్రశాంత్ పై, గొడవ చేసిన వారిపై కేసు నమోదు చేశారు. తాజాగా దీని గురించి సీపీఐ నారాయణ మాట్లాడుతూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. గతంలో అనేకసార్లు నారాయణ బిగ్‌బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు, కోర్టులో కేసు కూడా వేశారు.
Also Read : Salaar Tickets : సలార్ సినిమా టికెట్స్ ఆన్లైన్లో లేనట్టే.. థియేటర్ దగ్గరే కొనుక్కోవాలి..
తాజాగా బిగ్‌బాస్ ఘటనపై సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షో బయట ఆర్టీసీ బస్సులు పగలకొట్టారని సజ్జనార్ కేసులు పెడతా అన్నాడు. అసలు బిగ్‌బాస్ షో అనేదే అరాచకం. నేను ముందు నుంచి చెప్తున్నాను. సజ్జనార్ సైబర్ కమిషనర్ గా ఉన్నప్పుడు నేనే వచ్చి బిగ్‌బాస్ అనేది క్రైమ్ దాని మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇస్తే మూడు రోజులు పెట్టుకొని నేను చేయలేను కోర్టుకు వెళ్ళండి అన్నారు. నేను కింద కోర్టుకి వెళ్తే అక్కడ కొట్టేసి పై కోర్టుకి వెళ్ళమన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, కోర్టులు భయపడ్డాయి బిగ్‌బాస్ మీద చర్యలు తీసుకోవడానికి. బిగ్‌బాస్ లో అసాంఘిక, నీచాతినీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం డబ్బుల కోసం కక్రుత్తి పడి నాగార్జున లాంటి వాళ్ళు యాంకరింగ్ చేస్తున్నారు. కొంతమందిని తీసుకెళ్లి ఒక కొంపలో పడేసి దాన్ని వ్యభిచార కొంపలా చేసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలని అట్రాక్ట్ చేయడానికే రైతుబిడ్డ అని తీసుకొచ్చారు, పట్టణ ప్రాంతాల్లోని వారు సరిగ్గా చూడకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని వారిని అట్రాక్ట్ చేయడానికి అతన్ని తీసుకొచ్చి ప్రైజ్ ఇచ్చారు. ఇదంతా బిగ్ బాస్ షో యాజమాన్యం నాటకం. గ్రామీణ ప్రాంత ప్రజలని కూడా ఆడియన్స్ గా మార్చడానికే ఇదంతా చేశారు, బయట గొడవలు పెట్టారు. ఇప్పటికైనా దీన్ని తక్షణం బ్యాన్ చేయాలని కోరుతున్నాను అని అన్నారు. దీంతో సీపీఐ నారాయణా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
◻️ బిగ్ బాస్ షో ముందు కొట్లాడుకున్న యువకులపై కాదు సజ్జనార్ ప్రతాపం….*బిగ్ బాస్ యాజమాన్యం, అక్కినేని నాగార్జున పై చూపండి మీప్రతాపం* @tsrtcmdoffice @TSRTCHQ @TelanganaCMO @NarayanaKankana pic.twitter.com/ZKwm1pW8tw
— Sravani Journalist (@sravanijourno) December 18, 2023