Shahid Kapoor : ఆగిపోయిన షాహిద్ కపూర్ ‘అశ్వత్థామ’.. అదే కారణమా..

బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పౌరాణిక చిత్రం అశ్వత్థామ. సచిన్ బి రవి దర్శకత్వంలో అమెజాన్ స్టూడియోస్‌తో కలిసి పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ దాదాపుగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ పౌరాణిక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Shahid Kapoor Ashwatthama movie shooting stopped

Shahid Kapoor : బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పౌరాణిక చిత్రం అశ్వత్థామ. సచిన్ బి రవి దర్శకత్వంలో అమెజాన్ స్టూడియోస్‌తో కలిసి పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ దాదాపుగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ పౌరాణిక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో లెజెండరీ యోధుడు అశ్వత్థామగా షాహిద్ కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకోగా ఊహించని షాక్ ఇచ్చింది చిత్ర బృందం.

అయితే ఈ సినిమాను తాత్కాలికంగా ఆపేసినట్టు తెలుస్తుంది. బడ్జెట్ సమస్య అలాగే పలు వేరే కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆపేసినట్టు తెలుస్తుంది. అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతున్న కారణంగా ఎక్కువ బడ్జెట్ కోసం మేకర్స్ వెయిట్ చేస్తున్నారట. భారీ ఎత్తున పౌరాణిక యాక్షన్ ప్రాజెక్ట్‌గా దీనిని తీసుకురావాలని మేకర్స్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇలా అర్ధాంతరంగా మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

Also Read : Amitabh Bachchan : నిన్ను షోకి పిలిచి పెద్ద తప్పు చేశా.. అభిషేక్ బచ్చన్ కి అమితాబ్ షాక్..

ఇకపోతే ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం షాహిద్ కపూర్ తన బాడీ ని కూడా మార్చుకున్నాడు. దీనికి సంబందించి అన్ని ప్లానింగ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ బడ్జెట్ సమస్య వల్ల ఆగిపోవడంతో చిత్ర బృందం సైతం ఒకింత నిరాశ చెందుతుంది. మరి ఈ చిత్రానికి అనుకున్నంత బడ్జెట్ వచ్చి షూటింగ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నది చూడాలి.