Amitabh Bachchan : నిన్ను షోకి పిలిచి పెద్ద తప్పు చేశా.. అభిషేక్ బచ్చన్ కి అమితాబ్ షాక్..

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలు చేసిన ఈయన హిందీలో "కౌన్ బనేగా కరోడ్ పతి" అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Amitabh Bachchan : నిన్ను షోకి పిలిచి పెద్ద తప్పు చేశా.. అభిషేక్ బచ్చన్ కి అమితాబ్ షాక్..

I made a big mistake by inviting you to the show Amitabh Bachchan shock to Abhishek Bachchan

Updated On : November 17, 2024 / 3:57 PM IST

Amitabh Bachchan : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలు చేసిన ఈయన హిందీలో “కౌన్ బనేగా కరోడ్ పతి” అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షో కి చాలా మంది సినీ సెలెబ్రిటీస్ వచ్చారు. తాజాగా అభిషేక్ బచ్చన్ వచ్చారు. తన తదుపరి సినిమా “ఐ వాంట్ టు టాక్” కి సంబందించిన ప్రమోషన్స్ కోసం వచ్చి ఈ సినిమా గురించి అనేక విషయాలను తెలిపారు.

ఇక ఈ షోలో అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. “సాయంత్రం డిన్నర్ సమయంలో అందరం ఒకే దగ్గర కలుస్తాం.. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పిల్లలందరూ నాన్నలా చేస్తుంటారు. ‘సాట్ క్రోర్’ అంటూ అందరూ పిల్లలు నాన్నని ఇమిటేట్ చేస్తుంటారు. అక్కడితో ఆగరు ‘సాట్ క్రోర్ సాట్ క్రోర్’ అని పదే పదే నాన్నని ఏడిపిస్తుంటారు” అని చెప్తే అక్కడున్న వారందరూ నవ్వారు. అప్పుడు బిగ్ బి.. “అసలు నిన్ను ఈ షోకి పిలిచి తప్పు చేశా” అని అంటారు.

Also Read : Italy Mora : బాయ్ ఫ్రెండ్ ని కలిసి.. బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న మోడల్..

ఇక దాదాపుగా 16 సీజన్లను పూర్తిచేసుకున్న ఈ షోకి మొదటి నుండి బిగ్ బీనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కాగా అభిషేక్ బచ్చన్ నటించిన “ఐ వాంట్ టు టాక్” సినిమా నవంబర్ 22న విడుదల కానుంది.