Italy Mora : బాయ్ ఫ్రెండ్ ని కలిసి.. బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న మోడల్..
2024 మిస్ యూనివర్స్ పోటీల్లో పనామా తరపున పోటీ చేసేందుకు వచ్చింది మోడల్ ఇటలీ మోరా. అయితే ఎవ్వరూ ఊహించని విదంగా ఆమె ఎవ్వరి అనుమతి లేకుండానే తన ప్రియుడిని కలిసేందుకు ఓ హోటల్‌కి వెళ్లింది.

model Italy Mora who missed a golden chance by meeting her boyfriend
Italy Mora : మిస్ యూనివర్స్ అవ్వాలంటే ట్యాలెంట్, అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ పోటీ చివరి వరకు వెళ్లి విజయం సాదించకపోతే దాన్ని జీర్ణించుకోవడం కష్టం. అంతేకాదు అసలు ఇలాంటి ఒక గొప్ప అవకాశం చాలా అరుదుగా వస్తుంది. వచ్చినా కూడా దీనిని కొందరు నిలబెట్టుకోలేరు. అలాంటి వారి లిస్టులోకే చేరింది మోడల్ ఇటలీ మోరా. ఈ భామ చేసిన తప్పును కప్పిపుచ్చుదాం అనుకుంది కానీ పట్టేశారు నిర్వాహకులు.
అసలు ఏం జరిగిందంటే..2024 మిస్ యూనివర్స్ పోటీల్లో పనామా తరపున పోటీ చేసేందుకు వచ్చింది మోడల్ ఇటలీ మోరా. అయితే ఎవ్వరూ ఊహించని విదంగా ఆమె ఎవ్వరి అనుమతి లేకుండానే తన ప్రియుడిని కలిసేందుకు ఓ హోటల్‌కి వెళ్లింది. అంతేకాదు ఆ తర్వాత ప్రియుడు జువాన్ అబాడియాతో కలిసి మెక్సికోకు వెళ్లింది. అనంతరం ఈ విషయం తెలుసుకున్న మిస్ యూనివర్స్ నిర్వాహకులు ఆమెకు ఊహించని షాక్ ఇచ్చారు. డైరెక్ట్ గా ఆమెను మిస్ యూనివర్స్ పోటీ నుండి గెంటేశారు.
Also Read : Pushpa 2 : నేడే అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్.. ఎప్పుడు? ఎక్కడ? ఏ ఛానల్ లో?
నోటిదాకా వచ్చిన అవకాశాన్ని చేతులారా మిస్ చేసుకుంది ఈ సుందరి. ఇంకొన్ని రోజులు ఆగి ఈ పోటీల తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ను కలిసినా బాగుండేది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.