Pushpa 2 : నేడే అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్.. ఎప్పుడు? ఎక్కడ? ఏ ఛానల్ లో?

అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు బీహార్‌ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు.

Pushpa 2 : నేడే అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్.. ఎప్పుడు? ఎక్కడ? ఏ ఛానల్ లో?

Today Allu Arjun Pushpa 2 movie trailer

Updated On : November 17, 2024 / 2:29 PM IST

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చెయ్యబోతున్నారు మేకర్స్. ఇక అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈరోజు బీహార్‌ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో సాయంత్రం 6.03 గంటలకు ఈ ట్రైలర్‌రానుంది. ఇప్పటికే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా చేశారు మేకర్స్.

Also Read : Jyothika : కంగువా పై నెగిటివిటి.. సూర్యకి సపోర్ట్ చేస్తూ స్పందించిన జ్యోతిక..

బన్నీ అభిమానులతో పాటు, సినీ లవర్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్ ఈవెంట్ పాస్ ల కోసం తెగ కొట్టుకుంటున్నారు జనాలు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ను పెద్ద మొత్తంలో ఖర్చుచేసి చేస్తునట్టు తెలుస్తుంది. అయితే ఈ ట్రైలర్ తెలుగులో  మైత్రీ మూవీ మేకర్స్ , తమిళ్ లో AGS ఎంటర్టైన్మెంట్స్ , హిందీ  లో T- సిరీస్ యూట్యూబ్ ఛానల్, మలయాళం లో e4 ఎంటర్టైన్మెంట్స్ , కన్నడ లో అల్లు అర్జున్ యూట్యూబ్ ఛానల్ లో సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం అభిమానులు భారీ సంఖ్యలో రానున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భోజ్‌పురి హీరోయిన్ అక్షర సింగ్‌ ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుందట. చిత్ర బృందం మొత్తం ఈ ఈవెంట్ కి హాజరుకానున్నారు.


ఇక బీహార్ లో అల్లు అర్జున్ క్రేజ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. అంతేకాదు గన్నులతో ఆకాశంలో కాల్చి మరీ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు ఏ హీరోకి ఇలాంటి క్రేజ్ దక్కలేదని అంటున్నారు చాలా మంది విశ్లేషకులు. మరి ఈ రోజు సాయంత్రం జరగబోయే ఈ ఈవెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై వస్తుంది. ఇందులో శ్రీ లీల ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించనుంది.