Jyothika : కంగువా పై నెగిటివిటి.. సూర్యకి సపోర్ట్ చేస్తూ స్పందించిన జ్యోతిక..
సూర్య భార్య జ్యోతిక కంగువా సినిమా రిజల్ట్ పై స్పందించారు.. దీనికి సంబందించిన ఓ పోస్ట్ షేర్ చేశారు.

Jyothika responded by supporting Surya on Kangua movie negativity
Jyothika : తమిళ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి తెలిసిందే. ఈ స్టార్ హీరోకి తమిళంలో ఉన్న క్రేజ్ కి సమానంగా తెలుగులో కూడా ఉంది. ఆయన తమిళంలో చేసే ప్రతీ సినిమా తెలుగులో కూడా విడుదలవుతుంది. తాజాగా సూర్య కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నెల 14న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుండే కాసుల వర్షం కురిపిస్తుంది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది.
Also Read : Diljit Dosanjh : దిల్జిత్ దోసాంజ్ కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు.. స్పందించిన స్టార్ సింగర్
అయితే తాజాగా సూర్య భార్య జ్యోతిక కంగువా సినిమా రిజల్ట్ పై స్పందించారు.. దీనికి సంబందించిన ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ” ఇది కేవలం జ్యోతికగా, ఒక సినీ ప్రేమికురాలిగా మాత్రమే రాస్తున్నాను. సూర్య భార్యగా కాదు.. సూర్య మీపై ఎంతో గౌరవం పెరిగింది. మీరు సినిమాలపై చూపించే ఇంట్రెస్ట్, సినిమాల గురించి మీరు చేసే సాహసాలు అద్భుతం. కంగువా ఫస్ట్ హాఫ్ పెద్దగా వర్కవుట్ అవ్వకపోయినప్పటికీ , బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ మూడు గంటలు ఉన్న ఈ సినిమా ఒక సంపూర్ణ సినిమా అనుభవం తీసుకొచ్చింది. ఈ చిత్రం గురించి మీ టీమ్ అంతా ఎంత కష్టపడ్డారో తెలుస్తుందని” ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
View this post on Instagram
అంతేకాకుండా ఇంత అద్భుతమైన కెమెరా వర్క్ ఉన్న ఈ సినిమాపై కొందరు నెగిటివ్ రివ్యూలు ఇస్తుంటే నాకు చాలా షాకింగ్ గా ఉంది. అమ్మాయిలను హింసించే, అమ్మాయిల పట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఉన్న సినిమాల గురించి మాట్లాడనివారు ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా గురించి ఏమి చూడకుండా ఎలా మాట్లాడతారు..? కంగువా లోని పాజిటివ్స్ సంగతి ఏంటి.. ? కంగువా సెకండ్ హాఫ్ లోని ఆడవారి సీన్ మర్చిపోయారనుకుంట.. అసలు ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే ఇంత నెగిటివిటి ఎలా..? నిజానికి కంగువా చాలా బాగుంది. ఎంతో కస్టపడి 3D వండర్ అద్భుతంగా క్రియేట్ చేశారు అని ఆ పోస్ట్ లో పేర్కొంది జ్యోతిక. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.