Shahid Kapoor viral comments on South movies at Bloody Daddy promotions
Bloody Daddy Shahid Kapoor : బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన ‘బ్లడీ డాడీ’ సినిమా జూన్ 9న రిలీజ్ కి సిద్దమవుతుంది. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2011 లో వచ్చిన ఫ్రెంచ్ మూవీ ‘స్లీప్‌లెస్ నైట్’ (Sleepless Night) కి అడాప్షన్ గా తెరకెక్కుతుంది. అయితే థియేటర్ లో కాకుండా కొత్త ఓటీటీ జియో సినిమా (Jio Cinema) లో ఇది రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న షాహిద్.. సౌత్ ఇండస్ట్రీలు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Bhola Shankar : భోళా శంకరుడి మ్యానియా షురూ.. ఫస్ట్ సింగల్ లిరికల్ సాంగ్ రిలీజ్!
హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం వస్తే వెళ్తారా అనే ప్రశ్నకు బదులిస్తూ.. తాను హాలీవుడ్ కి వెళ్లే ఆలోచన అసలు లేదని తెలియజేశాడు. “హాలీవుడ్ సినిమాలో ఏదో ఒక చెత్త పాత్ర చేయడానికి అసలు ఇష్టం లేదు. ఆ చిత్రాల్లో నటించడానికి కంటే తమిళ్, తెలుగు, మలయాళ సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తాను. ఎందుకంటే ఆ సినిమాల్లో నటనకు ప్రాముఖ్యత ఇచ్చే పాత్రలు ఉంటాయి. నన్ను నేను నటుడిగా ఇంకొంచెం బెటర్ చేసుకునేందుకు ఆ సినిమాలు ఉపయోగపడతాయి” అంటూ సౌత్ సినిమాలను ఆకాశానికి ఎత్తేశాడు.
Sharwanand : శర్వానంద్ పెళ్లి ఫోటోలు చూశారా.. కొత్త ప్రయాణానికి శ్రీకారం!
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా షాహిద్ ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో నటిస్తూనే వచ్చాడు. ఇక ఇటీవల ఫర్జి (Farzi) అనే వెబ్ సిరీస్ లో సౌత్ యాక్టర్స్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), రాశి ఖన్నా (Rashi Khanna) లతో కలిసి నటించాడు. అలాగే గత ఏడాది నాని జెర్సీ (Jersy) ని రీమేక్ చేస్తూ.. టాలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననురితో వర్క్ చేసే అవకాశం అందుకున్నాడు. ఇక ఇప్పుడు షాహిద్ చేసిన ఈ కామెంట్స్ చూసి.. సౌత్ మేకర్స్ ఎవరైనా అవకాశం ఇస్తారేమో చూడాలి.