Shahrukh Khan : కాశ్మీర్ లో షారుఖ్ ఖాన్ డంకీ.. వీడియో వైరల్!
షారుఖ్ అండ్ రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డంకీ కొత్త షెడ్యూల్ కాశ్మీర్ లో మొదలైంది.

Shahrukh Khan Dunki movie schedule starts at Kashmir
Shahrukh Khan : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రీసెంట్ గా పఠాన్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో తను కమ్ బ్యాక్ ఇవ్వడమే కాదు, ప్లాప్ ల్లో ఉన్న బాలీవుడ్ ని కూడా ఆదుకున్నాడు. ఏకంగా 1000 కోట్ల పైగా కలెక్షన్స్ అందుకొని బాలీవుడ్ బాద్ షా అనిపించుకున్నాడు. ఇక ఈ మూవీ ఇచ్చిన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న షారుఖ్ ఆ సక్సెస్ ని అలానే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం షారుఖ్.. జవాన్ (Jawan), డంకీ (Dunki) చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒక మూవీ షెడ్యూల్ పూర్తి అవ్వగానే మరో సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు.
తాజాగా ఈ హీరో డంకీ మూవీ షూటింగ్ లోకి అడుగు పెట్టాడు. ఈ సినిమా ఇటీవలే దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, ఇప్పుడు కొత్త షెడ్యూల్ కాశ్మీర్ లో మొదలవ్వడంతో షారుఖ్ అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే కాశ్మీర్ లోని హోటల్ లో దిగిన షారుఖ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తున్నాడు. PK, సంజు వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత హిరానీ నుంచి వస్తున్న సినిమా కావడం, షారుఖ్ కూడా పఠాన్ సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
షారుఖ్ నటిస్తున్న మరో సినిమా జవాన్.. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఆల్మోస్ట్ ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యినట్లు సమాచారం. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. తమిళ స్టార్ హీరో విజయ్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ పాత్రని తెలుగులో అల్లు అర్జున్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు.
#ShahRukhKhan spotted entering hotel in Sonamarg ♥️?pic.twitter.com/qk9GA7Zrm1
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) April 24, 2023