Bharateeyudu 3: భారతీయుడు-3 మూవీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లేనా?
సినిమాకు చేసిన ఖర్చుకి, రెవెన్యూకి మధ్య భారీ తేడా ఉండటంతో..
![Bharateeyudu 3: భారతీయుడు-3 మూవీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లేనా? Bharateeyudu 3: భారతీయుడు-3 మూవీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లేనా?](https://10tv.in/wp-content/uploads/2024/08/maxresdefault.jpg)
Kamal Haasan Bharateeyudu 3
విశ్వనటుడు కమల్‌హసన్.. క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో నిర్మితమైన భారతీయుడు-3 మూవీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లేనా..? గత నెల 12న విడుదలైన భారతీయుడు సీక్వెల్ డిజాస్టర్‌గా మారడంతో త్రీక్వెల్‌పై సినీ నిర్మాతలు పునరాలోచనలో పడ్డారా? ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఏమైనా మార్పులు చేస్తారా? భారతీయుడు – 2 నష్టాల నుంచి బయటపడేందుకు ఇంకేమైనా మార్గాలు అన్వేషిస్తున్నారా?
తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నిర్మించిన భారతీయుడు – 3 సినిమా విడుదలపై సస్పెన్స్ ఏర్పడింది. గత నెల 12న రిలీజ్ అయి భారీ డిజాస్టర్‌గా మిగిలిన భారతీయుడు 2 వల్ల చిత్ర నిర్మాతలకు తలనొప్పులు ఎక్కువయ్యాయట… అందుకే నిర్మాతలు ఆచితూచి అడుగేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇండియన్ 2 హక్కుల కోసం భారీ మొత్తంలో ఒప్పందం చేసుకుంది.
నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్రతిపాదన
సుమారు 120 కోట్ల ఇచ్చేందుకు రిలీజ్ ముందు అగ్రిమెంట్ జరిగిందట. అయితే సినిమా ప్లాప్‌తో కనెక్షన్లు లేక నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు కొత్త ప్రతిపాదన పెట్టిందని సమాచారం. దానికి ఒప్పుకుంటేనే ఇండియన్ 3కి డీల్ మాట్లాడుకుందామని షరతు విధించడంతో నిర్మాణ సంస్థ లైకా సంస్థ షాక్ తిన్నదంటున్నారు.
సినిమాకు చేసిన ఖర్చుకి, రెవెన్యూకి మధ్య భారీ తేడా ఉండటంతో భారీ నష్టాలు వచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు కూడా తాము నష్టపోయామని… తమకు డబ్బులు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదింకా సెటిల్ చేయాల్సివున్నందున 2025 వేసవికి రిలీజ్ ప్లాన్ చేసుకున్న భారతీయుడు 3ని కొన్నాళ్లు ఆపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Citadel : ఎట్టకేలకు సమంత-వరుణ్ ధావన్ సిటాడెల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..