Shanmukh Jaswant makes emotional comments about his life
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జశ్వంత్.. నెటిజన్స్ కి ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో మనోడికి క్రేజ్ మాములుగా లేదు. తన యాక్టింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలు యూట్యూబ్ అంటే తెలియని రోజుల్లో దాన్ని ఒక కెరీర్ ఆప్షన్ గా ఎంచుకొని వరుసగా వీడియోస్ చేస్తూ ఆడియన్స్ ను అలరించాడు ఈ వైజాగ్(Shanmukh Jaswanth) కుర్రోడు. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి పెట్టాడు కానీ, కప్పు మాత్రం కొట్టలేకపోయాడు. దానికి చాలా కారణాలే ఉన్నాయి.
అయితే, మనోడి బ్యాడ్ లక్ అనుకోవాలో ఏమో తెలియదు కానీ, అతని తరువాత యూట్యూబ్ సార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మంచి పొజిషల్ లో ఉన్నారు. కానీ, షణ్ముఖ్ కి మాత్రం తాను ఆశించిన బ్రేక్ దొరకడం లేదు. ఆ మధ్య వచ్చిన సాఫ్ట్ వేర్ డెవలపర్స్, సూర్య లాంటి వెన్ సిరీస్ ను మంచి విజయాన్ని సాధించాయి. అందులో షణ్ముఖ్ నటనకి కూడా మంచి మార్కులే పడ్డాయి. కానీ, బిగ్ స్క్రీన్ ఆపర్చునిటీ మాత్రం రాలేదు.
కానీ, చాలా గ్యాప్ తరువాత తాను అనుకున్న కళను నెరవేర్చుకోబోతున్నాడు షణ్ముఖ్. త్వరలోనే హీరోగా వెండితెరపై కనిపించబోతున్నాడు. షణ్ముఖ్ చేస్తున్న ఫస్ట్ మూవీ “ప్రేమకు నమస్కారం”. యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షణ్ముఖ్ చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన లైఫ్ గురించి చెప్పుకుంటూ ఒకింత కన్నీళ్లు పెట్టుకున్నాడు.
“అసలు నేను బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండాల్సింది. తర్వాత ఓ కేసులో నా పేరు వచ్చింది. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. దాన్నుంచి బయటపడటానికి చాలా టైం పట్టింది. ఇక నా జీవితం అయిపోయిందని అనుకున్నాను. కానీ, ఒకరోజు నేను రోడ్డుపై వెళ్తుంటే ఒక పిల్లాడు నన్ను పిలిచి, నువ్వంటే చాలా ఇష్టం అన్నా.. కానీ, ఇప్పుడు నచ్చట్లేదు అని చెప్పాడు. అప్పుడే నాలో ఆలోచన మొదలైంది. మళ్ళీ నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నాను. కమ్‌బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా తీసుకున్న నిర్ణయమే ప్రేమకు నమస్కారం సినిమా. ఈ మధ్య నాన్నకు యాక్సిడెంట్ అయ్యింది. ఆరోజు నేను ఏడవకుండా ఆ బాధను పంటికింద బిగపట్టాను. ఎందుకంటే రీసెంట్ గా అమ్మకు క్యాన్సర్ సర్జరీ జరిగింది. ఏడిస్తే కుట్లు ఊడిపోతాయి. అందుకే, ఆరోజసలు ఏడవనేలేదు. ఏదేమైనా నేను ఒక మంచి కొడుకును కాలేకపోయాను” అంటూ చాలా ఎమోషనలయ్యాడు షణ్ముఖ్. ప్రస్తుతం దీనికి సంబందించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.