Niharika Konidela: నాకు అలవాటు లేదు కానీ, తప్పడం లేదు.. సీక్రెట్ చెప్పిన నిహారిక.. మీరు కూడా ఫాలో అవండి
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగబాబు(Niharika Konidela) కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

Mega daughter Niharika reveals her food and diet secret
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగబాబు కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. డీ షో ద్వారా యాంకర్ గా పరిచయమైనా నిహారిక ఆ తరువాత హీరోయిన్ గా మారింది. ఒక మనసు సినిమాలో నాగ శౌర్య పక్కన చేసింది. కానీ, ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు మంచి బ్యాక్ క్రియేట్ అయ్యింది. కానీ, అనుకున్నంత సక్సెస్ అవలేదు. ఆ తరువాత కూడా ఒకటి రెండు సినిమాలు చేసింది నిహారిక(Niharika Konidela). కానీ, నటిగా ఆమెకు అంత గుర్తింపును తెచ్చిపెట్టలేదు.
అందుకే నటనకు దూరమైన ఆమె నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ ను స్థాపించి ముందు చిన్నగా వెబ్ సిరీస్ లు చేయడం మొదలుపెట్టింది. వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో పూర్తి స్థాయి నిర్మాతగా మారింది. ఆమె నిర్మాతగా చేసిన మొదటి సినిమా “కమిటీ కుర్రాళ్ళు”. రూరల్ బ్యాక్డ్రాప్ లో దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ సూపర్ హిట్ గా నిలిచింది. నిర్మాతగా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది నిహారిక. ఆ తరువాత కాస్త గ్యాప్ తరువాత ఇటీవలే కొత్త సినిమాను స్టార్ట్ చేసింది మెగా డాటర్. మ్యాడ్ సినిమాలో తన సూపర్ యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెప్పించిన సంగీత్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా నయన్ సరిగా హీరోయిన్ గా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే మెగా డాటర్ నిహారిక తన ఫుడ్ డైట్ గురించి డీటెయిల్స్ చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. నేను రెగ్యులర్ గా డైట్ చేయను. కానీ, ప్రెజెంట్ డైట్ లో ఉన్నాను. అందుకే భోజనంలో పెద్దగా మార్పులు ఉండవు. ప్రతీరోజు ఒకేలాంటి భోజనం చేస్తున్నాను. ప్రెజెంట్ నేను తినేది గుడ్డు, చికెన్, డైట్ బిర్యానీ. నా డైట్ సీక్రెట్ ఇదే” అంటూ చెప్పుకొచ్చింది. మరి మెగా డాటర్ చెప్పున ఈ హెల్త్ డైట్ బాగుంది. మీరు కూడా మంచి హెల్త్ అండ్ ఫిట్ బాడీ కోసం ఫాలో అయిపోండి.