Shanmukh Jaswanth First Movie First Poster Released on Valentines Day
Shanmukh Jaswanth : షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో షణ్ముఖ్ జస్వంత్ పాపులర్ యూట్యూబ్ స్టార్ గా ఎదిగాడు. బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత పలు వివాదాల్లో ఇరుక్కోవడంతో కాస్త గ్యాప్ ఇచ్చిన షణ్ముఖ్ ఇటీవలే కొన్ని రోజుల క్రితం లీలా వినోదం అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో అవుదామని సినీ పరిశ్రమకు వచ్చాడు షన్ను. ఇప్పటికే షణ్ముఖ్ జస్వంత్ హీరోగా సినిమా ప్రకటించాడు.
Also Read : Laila : ‘లైలా’ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ లేడీ గెటప్ తో మెప్పించాడా?
తాజాగా నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ తన మొదటి సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. #shanmukh1 అనే వర్కింగ్ టైటిల్ తో హ్యాపీ డ్రింకర్స్ డే అంటూ షన్ను ఫేస్ చూపించకుండా నిల్చొని బాధపడుతూ ఉన్నట్టు ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇదేదో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ కథలా ఉందని అనిపిస్తుంది.
ఇక ఈ సినిమాని AB సినిమాస్ బ్యానర్ పై అనిల్ కుమార్, భార్గవ్ నిర్మాణంలో భీమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల దిల్ రాజు, విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ సినిమాని ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. త్వరలోనే మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తారని ప్రకటించారు. దీంతో షన్ను ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ షన్నుని వెండితెరపై హీరోగా ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. మరి యూట్యూబ్ లో తన సిరీస్ లతో రికార్డులు సెట్ చేసిన షన్ను హీరోగా ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.
Also Read : Laila Twitter Review : విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ ట్విట్టర్ రివ్యూ..