Laila : ‘లైలా’ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ లేడీ గెటప్ తో మెప్పించాడా?

ఇప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ లేడీ గెటప్ ట్రై చేసాడు విశ్వక్.

Laila : ‘లైలా’ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ లేడీ గెటప్ తో మెప్పించాడా?

Vishwaksen Akanksha Sharma Laila Movie Review and Rating

Updated On : February 14, 2025 / 1:18 PM IST

Vishwak Sen Laila Movie Review : మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌ నేడు ఫిబ్రవరి 14న ‘లైలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించగా, బబ్లూ పృథ్వీరాజ్, అభిమన్యు సింగ్, వినీత్ కుమార్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే.. సోను మోడల్(విశ్వక్ సేన్) తన తల్లి ఇచ్చిన బ్యూటీ పార్లర్ నడుపుతూ ఓల్డ్ సిటీలో ఆడవాళ్లందరికి ఫేవరేట్ మేకప్ మ్యాన్ గా ఉంటాడు. అందర్నీ అక్క చెల్లి అంటూ మంచిగా ఉంటాడు. జిమ్ ట్రైనర్ అయిన జెన్నీ(ఆకాంక్ష శర్మ)తో ప్రేమలో పడతాడు. SI శంకర్(బబ్లూ పృథ్వీరాజ్) ఇద్దరు భార్యల విషయం ఒకరికొకరికి తెలిసేలా చేసి అతనికి శత్రువు అవుతాడు సోను. సోను మేకప్ వేసిన ఒక అమ్మాయిని చూసి రుస్తుం(అభిమన్యు సింగ్) పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమె నల్లగా ఉంటుందని, అదంతా మేకప్ అని పెళ్లయ్యాక తెలియడంతో రుస్తుం సోనుపై పగపెంచుకుంటాడు.

ఇదే సమయంలో సోను తన పార్లర్ కి వచ్చే ఓ మహిళ ఆయిల్ బిజినెస్ కి హెల్ప్ చేస్తాడు. ఆ ఆయిల్ తో వండిన ఫుడ్ తిని చాలా మంది హాస్పిటల్ పాలవుతారు. మరో వైపు ఖలీల్ భాయ్(గుళ్ళు దాదా) సోనుని చంపడానికి తిరుగుతూ ఉంటాడు. అలా అన్ని వైపులా సోనుపై అటాక్ చేద్దామని ట్రై చేస్తూ సోను బ్యూటీ పార్లర్ పై దాడి చేస్తారు. దీంతో సోనుపై పడ్డ నిందలు అన్ని అబద్దం అని నిరూపించుకోడానికి కొన్నాళ్ళు వీళ్లకు కనపడకుండా ఉండాలని లేడీ గెటప్ వేసి లైలాగా మారతాడు. మరి లైలాగా మారి ఎవరికి దగ్గరయ్యాడు? ఇతన్ని ఆయిల్ కేసులో ఎవరు ఇరికించారు? అతనికి బ్యూటీ పార్లర్, మేకప్ అంటే ఎందుకు ఇష్టం? లేడీ గెటప్ వేసింది సోను అని చివరికి విలన్స్ కి ఎలా తెలిసింది? లేడీ గెటప్ తో సోను పడ్డ ఇబ్బందులు ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Brahma Anandam : ‘బ్రహ్మ ఆనందం’ మూవీ రివ్యూ.. నవ్విస్తూనే ఏడిపించిన తండ్రీకొడుకులు..

సినిమా విశ్లేషణ.. అప్పుడెప్పుడో మేడం, భామనే సత్యభామనే అంటూ హీరోలు ఫుల్ లెంగ్త్ లేడీ వేషం వేసిన సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత చాలా మంది హీరోలు లేడీ గెటప్స్ వేసినా కొన్ని సీన్స్ వరకే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ లేడీ గెటప్ ట్రై చేసాడు విశ్వక్. ఫస్ట్ పార్ట్ అంతా సోను పాత్ర, సోను బ్యూటీ పార్లర్, సోను జెన్నీ లవ్ స్టోరీ, రుస్తుం, SI శంకర్, ఆయిల్ బిజినెస్.. అన్ని చోట్ల సోను బుక్ అవ్వడంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి ఈ గొడవల నుంచి తప్పుకోవడానికి లేడీ గెటప్ వేసి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో లేడీ గెటప్ వేసి తనపై పడ్డ నిందలు ఎలా తొలగించుకున్నాడు, ఈ క్రమంలో అతను ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి అని చూపించారు.

ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా సాగదీశారు. సోను మోడల్ అని హైదరాబాద్ సోషల్ మీడియా మోడల్స్ టైపు లో క్యారెక్టర్ ఫుల్ యాక్టివ్ గానే డిజైన్ చేసారు. సెకండ్ హాఫ్ లో కూడా కాస్త ల్యాగ్ ఉంటుంది. ఇక సినిమా అంతా డబల్ మీనింగ్ జోక్స్, అడల్ట్ జోక్స్ తో నవ్వించాలనే ప్రయత్నం చేసారు. కొన్ని చోట్ల లేడీ గెటప్ తో చేసే కామెడీ క్రింజ్ గానే అనిపిస్తుంది. తల్లి ఎమోషన్ మాత్రం కాస్త వర్కౌట్ అయింది. అందం ముఖ్యం కాదు, గుణం ముఖ్యమనే పాయింట్ కూడా బాగానే చెప్పడానికి ప్రయత్నించారు. డైలాగ్స్, సీన్స్.. ఇవన్నీ చూస్తే ఈ సినిమా కేవలం యూత్ కే. ఫ్యామిలీతో కలిసి లైలాని చూడలేం. ఫస్ట్ హాఫ్ అంతా హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో జరగడం, ఆ డైలాగ్స్ అన్ని కూడా హిందీ – తెలుగు మిక్స్ అయి ఉండటం చూస్తే ఇది కేవలం హైదరాబాద్ వరకే పరిమితమైన సినిమాలా అనిపిస్తుంది. ఏపీలో మాత్రం కష్టమే. చిరంజీవి ఫాన్స్ కి మాత్రం ఈ సినిమా మంచి కిక్కు ఇస్తుంది. సినిమాలో చిరంజీవి టైటిల్స్, చిరంజీవి సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ ఫొటోలతో సినిమాలో చిరు రిఫరెన్స్ లు చాలానే ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ ని గెస్ట్ గా పిలిచారేమో.

Vishwaksen Akanksha Sharma Laila Movie Review and Rating

నటీనటుల పర్ఫార్మెన్స్.. సోను పాత్రలో విశ్వక్ తన రెగ్యులర్ యాక్టివ్ యాక్టింగ్ తో పర్వాలేదనిపించినా లేడీ గెటప్ కోసం మాత్రం బాగానే కష్టపడ్డాడు. ఆ మేకప్, అమ్మాయి లాగే నడవడం, హావభావాలు, లేడీ గెటప్ లో యాక్షన్ సీన్స్.. అన్ని బాగానే చేసాడు. కాకపోతే ఆ లేడీ గెటప్ తో చేసే అడల్ట్ కామెడీ మాత్రం కష్టమే. ఇక హీరోయిన్ ఆకాంక్ష శర్మ కేవలం అందాల ఆరబోతకే. ఇదే తనకు తొలి సినిమా. మొదటి సినిమాలోనే బికినీలు, లిప్ లాక్ లు చేసేసింది. మరి ఈ అందాలు చూసి ఎవరన్నా ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి. ఎప్పుడూ విలన్ పాత్రలు వేసే అభిమన్యు సింగ్ రుస్తుం పాత్రలో కామెడీతో కొత్తగా ప్రయత్నించాడు. బబ్లూ పృథ్వి రాజ్, కామాక్షి భాస్కర్ల, విశ్వక్ తల్లి పాత్రలో నటించిన నటి, గుళ్ళు దాదా.. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు.

Also Read : Laila Twitter Review : విశ్వ‌క్ సేన్ ‘లైలా’ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ..

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ప్లస్ అయ్యాయి. స్క్రీన్ అంతా కలర్ ఫుల్ గా ప్రతి ఫ్రేమ్ ని అందంగా చూపించారు. ఒక్క నాగరత్తమ్మ సాంగ్ తప్ప మిగిలిన పాటలు వినడానికి కూడా కష్టమే. హీరోయిన్ తో ఉన్న రెండు సాంగ్స్ హీరోయిన్ అందాలు చూడటానికే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్ లో హెవీగా ఉంటుంది. ఒక హీరోకి సమస్యలు వస్తే లేడీ గెటప్ తో ఎలా తప్పించుకున్నాడు అనే కథని అడల్ట్ కామెడీతో రెగ్యులర్ స్క్రీన్ ప్లేతో రాసుకున్నాడు దర్శకుడు రామ్ నారాయణ్. ఇతని గత సినిమా కూడా బోల్డ్ కామెడీనే. ఇక నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘లైలా’ సినిమా ఓ హీరో సమస్యల్లో ఇరుక్కుంటే వాటి నుంచి బయటపడటానికి లేడీ గెటప్ వేసి ఏం చేశాడు అని ఆసక్తికరంగా కాస్త అడల్ట్ కామెడీతో చూపించారు. ఈ సినిమాకు రేటింగ్ 2 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.