Bigg Boss 5 Telugu : దీప్తితో ప్రేమలో షన్ను..!

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయనల ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది..

Deepthi Sunaina

Bigg Boss 5 Telugu: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ ‘బిగ్ బాస్ 5’ లోకి భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లో అందరికంటే తానొక్కడే కాస్త సైలెంట్‌గా ఉంటున్నాడు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌కి, ఇంటి సభ్యులకు, ప్రేక్షకులకు ఎలాంటి భయం లేకుండా తన గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పి సర్‌ప్రైజ్‌తో కూడిన షాక్ ఇచ్చాడు.

Bigg Boss 5 Telugu : సరయు ఎలిమినేషన్..?

సోషల్ మీడియాలో పాపులర్ అయిన దీప్తి సునయనతో తాను ప్రేమలో ఉన్నట్లు అనౌన్స్ చేశాడు. బాయ్ ఫ్రెండ్ ‘బిగ్ బాస్ 5’ లోకి ఎంట్రీ ఇచ్చిన్ సందర్భంగా ప్రీమియర్ ఎపిసోడ్ స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ ఐ లవ్యూ చెప్పేసింది దీప్తి.

గతకొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ అఫీషియల్‌గా చెప్పెయ్యడంతో పుకార్లు అన్నీ నిజమేనని ప్రూవ్ అయ్యాయి. దీప్తి, షణ్ముఖ్ ఇద్దరూ కలిసి యాక్ట్ చేసిన ‘మలుపు’ సాంగ్ ప్రోమోస్ దీప్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చెయ్యగా వైరల్ అవుతున్నాయి.

Pics & Video Credit by : @deepthi_sunaina
instagram