Unstoppableshannu
UnstoppableShannu: బిగ్ బాస్ సీజన్ ఏదైనా ఫైనల్ గా ట్రోఫీ అందుకోవాలంటే సోషల్ మీడియాలో ఫాలోయింగ్, సపోర్ట్ చాలా అవసరం. తొలి నుండి చివరి వరకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా కంటెస్టెంట్ ను ఇంట్లో ఉండేలా కాపాడుతుంది. ఐదవ సీజన్ మొదలైనపుడే కంటెస్టెంట్లలో ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు.. ఎవరికి ఎంత సపోర్ట్ ఉండే అవకాశం ఉందనే చర్చలు సాగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో షణ్ముఖ్ జస్వంత్ అందరికంటే ముందు రేసులో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
RRR: బ్లాస్టింగ్ అప్డేట్.. డిసెంబర్ 9న ట్రైలర్!
యూట్యూబ్ లో షణ్ముఖ్ కి భారీ క్రేజ్ ఉంది. అతడికి మద్దతు ఇచ్చేవారు బాగానే ఉంటారు. ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’, ‘సూర్య’ లాంటి సిరీస్ లతో షణ్ముఖ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అదే షన్నును బిగ్ బాస్ వరకు నడిపించింది. కాగా.. తొలి వారం నుండే అటు ఫాలోయింగ్ తో పాటు ఇటు మైండ్ గేమ్ తో ఇక్కడి వరకు వచ్చాడు. ఇక, ఇప్పుడు ట్రోఫీ వరకు వెళ్లాలంటే సోషల్ మీడియాలో క్రేజ్ చాలా కీలకం. అందుకే బయట ఆ పని కూడా మొదలైంది. సోషల్ మీడియాలో షన్ను షేక్ పుట్టిస్తున్నాడు.
Shama Sikander: షామా హొయలు.. ఊపేస్తున్న హాట్ బ్యూటీ!
ట్విట్టర్ వేదికగా #UnstoppableShannu అంటూ అభిమానులు రచ్చ చేస్తున్నారు. పనిగట్టుకొని UnstoppableShannu హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్స్ మొదలు పెట్టిన ఫ్యాన్స్ లక్షల కొద్దీ ట్వీట్స్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. ప్రజెంట్ UnstoppableShannu ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా నిమిషాలలో వేలకొద్దీ ట్వీట్స్ పోగవుతూ ఇప్పటికే లక్షలలో ట్వీట్స్ పోటెత్తుతున్నాయి. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో.. షన్ను ట్రోఫీ అందుకుంటాడా అన్నది ఆసక్తిగా మారింది.
350k smashed we done cults #UnstoppableShannu pic.twitter.com/zGapr95OYB
— CRYPTO UPDATES TELUGU (@Nani70525756) December 4, 2021
https://twitter.com/TrendsShannu/status/1467104300144807937