Sharwanand
Sharwanand : శర్వానంద్ ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ తర్వాత హీరోగా ఎదిగాడు. ఇటీవల సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. శర్వానంద్ చిరంజీవితో శంకర్ దాదా MBBS సినిమాలో కలిసి నటించాడు. కానీ సినిమాల్లో రాకముందే చిరంజీవితో కలిసి నటించాడు శర్వానంద్.(Sharwanand)
శర్వానంద్, రామ్ చరణ్ చిన్నప్పట్నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. చిరంజీవి ఇంటికి కూడా వెళ్లి శర్వానంద్ ఆడుకునేవాడు చరణ్ తో. ఈ విషయం చరణ్, శర్వా ఎన్నో సార్లు చెప్పారు.
Also Read : Prabhas : సలార్ అన్ సీన్ ఫోటో చూశారా..? ప్రభాస్ శృతి క్యూట్ ఫోటో వైరల్..
అయితే.. శర్వానంద్ మొదట యాక్టింగ్ లోకి వద్దాం అనుకున్నప్పుడు చరణ్ కే ఫస్ట్ చెప్పాడట. ఒక రోజు చిరు ఇంట్లో శర్వానంద్ రామ్ చరణ్ తో ఉండగా అప్పుడే థమ్స్ అప్ వాళ్ళతో మీటింగ్ ముగించుకొని చిరంజీవి వచ్చారు. ఆ మీటింగ్ లో చిరంజీవితో కలిసి థమ్స్ అప్ యాడ్ లో నటించడానికి ఒక కొత్త యంగ్ బాయ్ కావాలని అన్నారట. ఆ విషయం గుర్తొచ్చి చిరంజీవి.. శర్వానంద్ ని థమ్స్ అప్ యాడ్ లో చేస్తావా నాతో కాంబినేషన్ అంటే వెంటనే ఒప్పుకున్నాడట శర్వా.
అలా శర్వానంద్ సినిమాల్లో కంటే ముందే చిరంజీవితో కలిసి థమ్స్ అప్ యాడ్ లో నటించాడు. ఈ యాడ్ లో శర్వా చిరుతో కలిసి ఇంద్ర వీణ స్టెప్ కూడా వేయడం గమనార్హం. ఇది 2003లో జరిగింది. ఆ తర్వాత శర్వానంద్ ఐదో తారీఖు అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి, శర్వానంద్ కలిసి నటించిన అప్పటి థమ్స్ అప్ మీరు కూడా యాడ్ చూసేయండి..
Also See : Neha Shetty : ఫ్రెండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం.. తనతో కలిసి నేహశెట్టి హాట్ పోజులు..