Prabhas : సలార్ అన్ సీన్ ఫోటో చూశారా..? ప్రభాస్ శృతి క్యూట్ ఫోటో వైరల్..
సలార్ మూవీ సోషల్ మీడియా పేజీలో సలార్ షూటింగ్ సెట్ లో ప్రభాస్ శృతి హాసన్ ల అన్ సీన్ ఫోటోని షేర్ చేశారు. (Prabhas)
Prabhas
Prabhas : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంది. సలార్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.(Prabhas)
నిన్న జనవరి 28న శృతి హాసన్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో సలార్ మూవీ సోషల్ మీడియా పేజీలో సలార్ షూటింగ్ సెట్ లో ప్రభాస్ శృతి హాసన్ ల అన్ సీన్ ఫోటోని షేర్ చేశారు.
Also Read : Neha Shetty : ఫ్రెండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం.. తనతో కలిసి నేహశెట్టి హాట్ పోజులు..
ఈ ఫొటోలో శృతి హాసన్ ఫోన్ లో ప్రభాస్ కి ఫోన్ లో ఏదో చూపిస్తుంది. ఈ ఇద్దరూ నవ్వుతూ ఉన్నారు. ఈ ఫోటో షేర్ చేసి.. సలార్ 2 లో తనకు ఏం జరగబోతుందో ఆద్య దేవా కు చూపిస్తుంది అని రాసుకొచ్చారు.
ప్రభాస్, శృతి హాసన్ ఇలా నవ్వుతూ క్యూట్ గా కనపడటంతో ఫ్యాన్స్ సంతోషిస్తూ ఈ ఫోటో వైరల్ చేస్తున్నారు. త్వరగా సలార్ 2 మొదలుపెట్టండి అని కామెంట్స్ చేస్తున్నారు. సలార్ సినిమా అంతా సీరియస్ గా కనపడిన ప్రభాస్ ఇలా షూటింగ్ బ్రేక్స్ లో సరదాగా నవ్వడంతో ఫ్యాన్స్ ప్రభాస్ క్యూట్ ఫోటో అంటూ తెగ వైరల్ చేస్తున్నారు.
