Sharwanand Car accident small injuries to Sharwanand
Sharwanand : టాలీవుడ్(Tollywood) హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. కొన్ని నెలల క్రితం రక్షిత అనే అమ్మాయితో నిశితార్థం చేసుకున్న శర్వానంద్ జూన్ 3న జైపూర్(Jaipur) ప్యాలెస్ లో వివాహం చేసుకోబోతున్నారు. కానీ అంతలోనే శర్వానంద్ కు యాక్సిడెంట్ జరిగింది. శర్వానంద్ కు ఇవాళ తెల్లవారు జామున యాక్సిడెంట్ జరిగింది.
హైదరాబాద్(Hyderabad) ఫిలింనగర్ జంక్షన్ వద్ద నేడు తెల్లవారుజామున శర్వానంద్ తన రేంజ్ రోవర్ కారులో వెళ్తుండగా ఒక్కసారిగా కారు బోల్తా పడి యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ లో శర్వానంద్ కి గాయాలు అయ్యాయి. అయితే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేదానిపై ఇంకా పూర్తి వివరాలు తెలీదు.
NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి.. రాజకీయ చరిత్రపై స్పెషల్ ఫోకస్..
అలాగే ఈ యాక్సిడెంట్ పై శర్వానంద్ కానీ, అతని ఫ్యామిలీ కానీ స్పందించలేదు. అయితే ఈ ప్రమాదంపై తాజాగా శర్వానంద్ మేనేజర్, అతని టీం స్పందిస్తూ.. హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్ జంక్షన్ దగ్గర అదుపు తప్పిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా వున్నారు. కారుకి మాత్రం చిన్న గీత పడింది. ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ అక్కడే వున్నారు. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అని తెలిపారు. వారం రోజుల్లో పెళ్లి ఉండగా ఇప్పుడు ఇలా యాక్సిడెంట్ అవ్వడంతో శర్వానంద్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. శర్వానంద్ ఇటీవలే ‘ఒకేఒక జీవితం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.