Sharwanand Gives Clarity on Manamey Event in Pithapuram
Pithapuram : శర్వానంద్(Sharwanand) ‘మనమే’ సినిమాతో రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా 35వ సినిమాగా మనమే తెరకెక్కగా ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మనమే సినిమా జూన్ 7న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నిర్వహించారు.
అయితే మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో చేద్దామనుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం, భారీ మెజారిటీతో గెలవడంతో ఆ ఊరిపేరు దేశమంతా మోగిపోతుంది. మనమే నిర్మాత విశ్వప్రసాద్ కు, పవన్ కళ్యాణ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పవన్ గెలుపు తర్వాత మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో గ్రాండ్ గా చేద్దామనుకున్నారు. కానీ పోలీసుల పర్మిషన్ రాకపోవడంతో ఈవెంట్ అక్కడ నిర్వహించలేకపోయారు.
Also Read : Venkatesh – Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యే గారు.. అంటూ పవన్ పై వెంకీమామ ఆసక్తికర పోస్ట్..
దీంతో హైదరాబాద్ లో జరిగిన మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో శర్వానంద్ దీనిపై స్పందించాడు. శర్వానంద్ మాట్లాడుతూ.. ఇదే రోజు ఈవెంట్ పిఠాపురంలో చేద్దామనుకున్నాం. కానీ అడిగితే పర్మిషన్స్ రాలేదు. అందుకే సక్సెస్ పార్టీ అయినా అక్కడ ప్లాన్ చేయమని నిర్మాతలని కోరుతున్నాను. పిఠాపురంలో ఫస్ట్ సినిమా ఈవెంట్ ఈ సినిమాది జరగాలని నా కోరిక. అందుకే సినిమా హిట్ అయ్యాక సక్సెస్ ఈవెంట్ పిఠాపురంలోనే చేద్దాం అని తెలిపారు. దీంతో పవన్ అభిమానులు సంతోషిస్తున్నారు. పిఠాపురంలో కూడా సినిమా ఈవెంట్స్ జరిగితే అక్కడ ప్రజలు కూడా సంతోషంగా ఫిల్ అవుతారు అని అంటున్నారు. ఇకపై భవిష్యత్తులో పిఠాపురంలో చాలా సినిమా ఈవెంట్స్ జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.