Venkatesh – Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యే గారు.. అంటూ పవన్ పై వెంకీమామ ఆసక్తికర పోస్ట్..

తాజాగా విక్టరీ వెంకటేష్ పవన్ కళ్యాణ్ గెలుపుపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.

Venkatesh – Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యే గారు.. అంటూ పవన్ పై వెంకీమామ ఆసక్తికర పోస్ట్..

Venkatesh Special Tweet on Pawan Kalyan Victory with Calling Pawan as Pithapuram MLA garu

Updated On : June 5, 2024 / 4:28 PM IST

Venkatesh – Pawan Kalyan : ఏపీలో కూటమి భారీ విజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. సంగతి తెలిసిందే. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలవడమే కాక జనసేన తరపున నిల్చున్న 21 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీలు గెలిచారు. అభిమానులు, కార్యకర్తలు ఆనందంలో ఉన్నా ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అనేకమంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్స్ చేశారు.

Also Read : NTR : హమ్మయ్య.. ఎట్టకేలకు ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపు పై స్పందించిన ఎన్టీఆర్.. ఏమన్నాడంటే..

కొద్దీ సేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ కూడా పవన్ కళ్యాణ్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. తాజాగా విక్టరీ వెంకటేష్ పవన్ కళ్యాణ్ గెలుపుపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. వెంకటేష్ తన ట్వీట్ లో.. కంగ్రాట్స్ డియర్ పవన్ కళ్యాణ్ ఇంతటి భారీ విజయం సాధించినందుకు. దీనికి నీకంటే అర్హులు ఎవరు లేరు. నువ్వు మరింత ఎత్తుకు ఎదిగి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, శక్తి, అంకితభావం కొనసాగించాలి, అలాగే నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే గారు అని పోస్ట్ చేసాడు. అలాగే చంద్రబాబుకు కూడా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

అయితే చివర్లో పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ వెంకిమామ పోస్ట్ చేయడంతో ఈ ట్వీట్ మరింత వైరల్ అవుతుంది. దీనిపై పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ – వెంకటేష్ కలిసి గోపాల గోపాల సినిమా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఆధ్యాత్మికత, పుస్తకాల విషయంలో మంచి స్నేహితులు కూడా. ఇక వెంకటేష్ ఈ ఎన్నికల్లో తమ బంధువులైన ఇద్దరు అభ్యర్థుల కోసం ప్రచారం చేయగా వాళ్ళు కూడా గెలిచారు.

తెలంగాణ ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో వెంకటేష్ వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేయగా వెంకటేష్ ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నుంచి పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ కూడా వెంకటేష్ బంధువు కావడంతో మద్దతుగా ప్రచారం చేశారు. ఈ ఇద్దరూ కూడా గెలిచారు.