Shatamanam Bhavati : ‘శతమానం భవతి’ సీక్వెల్ అనౌన్స్.. వచ్చే సంక్రాంతికి బరిలో..

తాజాగా శతమానం భవతి సినిమాకు సీక్వెల్ ప్రకటించారు దిల్ రాజు నిర్మాణ సంస్థ.

Shatamanam Bhavati Sequel Announced by Dil Raju Releasing on 2025 Sankranthi

Shatamanam Bhavati : శర్వానంద్(Sharwanand), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు(Dil Raju) నిర్మాతగా 2017లో వచ్చిన సినిమా ‘శతమానం భవతి’. 2017 లో సంక్రాంతికి(Sankranthi) రిలీజయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సంక్రాంతి పండగ చుట్టూ ఫ్యామిలీ బంధాలు, ఎమోషన్స్ తో అల్లుకున్న పల్లెటూరు కథ ఇది. ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించింది. అలాగే నేషనల్ అవార్డుతో పాటు నంది అవార్డులు, ఇంకా పలు ప్రైవేట్ అవార్డులు కూడా గెలుచుకుంది శతమానం భవతి సినిమా.

తాజాగా శతమానం భవతి సినిమాకు సీక్వెల్ ప్రకటించారు దిల్ రాజు నిర్మాణ సంస్థ. ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’ అని ఈ సీక్వెల్ ని ప్రకటించారు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి 2025లో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించేశారు. దీంతో వచ్చే సంక్రాంతికి ఇప్పుడే సినిమాని లైన్లో పెట్టేశారు దిల్ రాజు.

Also Read : Varun Vithika : సంక్రాంతి స్పెషల్.. వరుణ్ వితిక ట్రెడిషినల్ కపుల్ ఫొటోషూట్..

అయితే ఈ సినిమాకి సంబంధించి మరే డీటెయిల్స్ ఇంకా ప్రకటించలేదు. హీరో, హీరోయిన్స్ శర్వానంద్, అనుపమనే తీసుకుంటారా లేదా వేరే వాళ్ళతో చేస్తారా? మళ్ళీ సంతోష్ వేగేశ్న డైరెక్షన్ చేస్తారా? శతమానం భవతి సినిమాలాగే రాబోయే సీక్వెల్ కూడా మెప్పిస్తుందా అంటే ఎదురు చూడాల్సిందే.