Shatamanam Bhavati Sequel Sharwanand Replace with another Hero Rumours goes Viral
Shatamanam Bhavati : 2017లో సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజయి భారీ విజయం సాధించింది శతమానం భవతి. శర్వానంద్(Sharwanand), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు(Dil Raju) నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. సంక్రాంతి పండగ, ఓ కుటుంబం, బంధాలు, అనుబంధాలతో ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులని మెప్పించింది. ఈ సినిమా నేషనల్ అవార్డు, నంది అవార్డుతో పాటు అనేక అవార్డులు అందుకుంది.
ఇటీవల శతమానం భవతి సినిమాకు సీక్వెల్ ని ప్రకటించారు. దిల్ రాజు నిర్మాణంలోనే ఈ సీక్వెల్ ఉండనుంది. శతమానం భవతి నెక్స్ట్ పేజీ అంటూ ప్రకటించి వచ్చే సంవత్సరం 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాని ఎవరెవరితో తీస్తున్నారో మాత్రం ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ అయితే శతమానం భవతి సీక్వెల్ లో నటించడు అని తెలుస్తుంది.
నిన్న శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా శర్వానంద్ 35, 36, 37 సినిమాలని అధికారికంగా ప్రకటించారు. ఈ లిస్ట్ లో శతమానం భవతి సీక్వెల్ లేకపోవడం గమనార్హం. ఒకవేళ శతమానం భవతి సీక్వెల్ లో శర్వానంద్ ఉంటే ఈ లైనప్ లో ఉండాలి, నిన్న పుట్టిన రోజున ప్రకటించాలి. కానీ దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం, శర్వానంద్ నెక్స్ట్ మూడు సినిమాలు ప్రకటించడంతో ఈ సినిమాలో శర్వానంద్ లేడనే తెలుస్తుంది.
Also Read : Harika Narayan : ఏడేళ్ల ప్రేమ.. నిశ్చితార్థం చేసుకున్న బ్యూటిఫుల్ సింగర్..
అయితే శతమానం భవతి సీక్వెల్ లో దిల్ రాజు తమ్ముడి కొడుకు, హీరో ఆశిష్ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఆశిష్ ప్రస్తుతం రౌడీ బాయ్స్ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆశిష్ తోనే శతమానం భవతి సీక్వెల్ ఉంటుందని టాలీవుడ్ లో వినిపిస్తుంది. మరి ఇదే నిజమైతే శతమానం భవతి సినిమాకు వచ్చినంత రీచ్ ఈ సినిమాకి వస్తుందా చూడాలి. అధికారికంగా అయితే శతమానం భవతి సీక్వెల్ సినిమా నుంచి హీరో, హీరోయిన్, దర్శకుడు.. ఎవరు అనేది ఎలాంటి ప్రకటన చేయలేదు.
7 years ago, #ShathamanamBhavathi Celebrated Sankranthi with its timeless magic ❤️
Now, get ready for another chapter unfolding with even more enchantment in 2025! 😍
More Details loading soon 😉
వచ్చే సంక్రాంతికి కలుద్దాం ❤️🔥 pic.twitter.com/yJT5xump4Q
— Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2024